News March 21, 2024

నేడు ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన!

image

ఆదిలాబాద్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిని నేడు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా ఆత్రం సక్కును ప్రకటించగా.. BJP అభ్యర్థిగా గోడం నగేశ్ బరిలో ఉన్నారు. ఇక్కడ బలమైన నాయకుడిని బరిలో నిలపాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. దీంతో తమ పార్టీ అభ్యర్థి ఎవరని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారో కామెంట్ చేయండి.

Similar News

News December 1, 2025

బాధితుల సమస్యలను పరిష్కరించాలి: ADB SP

image

ఫిర్యాదుదారుల సమస్యల పట్ల బాధ్యత అధికంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి 28 ఫిర్యాదులు అందగా వాటిని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చి పరిష్కరించాలన్నారు. ఎలాంటి సమాచారం ఉన్న 8712659973 నంబర్‌కు తెలియజేయలన్నారు. ఆయనతో పాటు సీసీ కొండరాజు ఉన్నారు.

News December 1, 2025

ADB: విదేశి విద్య కోసం ఫ్రీ కోచింగ్

image

ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ పాసైన విద్యార్థులకు విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించేందుకు కీలకమైన IELTS (ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం) ఉచిత శిక్షణ కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ డిబిసిడబ్ల్యూఓ రాజలింగు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈనెల 21లోపు www.tgbcstudycircle.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News December 1, 2025

ADB: రామన్న.. సర్పంచ్ నుంచి మంత్రి వరకు

image

సర్పంచ్ నుంచి మంత్రి వరకు ఎదగాలంటే రాజకీయాల్లో ఎంతో నిలదొక్కుకోవాలి. అలాంటి అవకాశమే మాజీ మంత్రి జోగు రామన్నను వరించింది. జోగు రామన్న జైనథ్ మండలంలోని దీపాయిగూడకు సర్పంచ్‌గా, ఎంపీటీసీ, జడ్పీటీసీగా సేవలందించారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన స్వరాష్ట్ర సాధనలో భాగంగా తన పదవికి రాజీనామా చేశారు. అనంతం జరిగిన మూడు ఎన్నికల్లో గెలుపొందారు. బీఆర్ఎస్ హయాంలో సీఎం KCR క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు.