News July 11, 2024
నేడు ఆదిలాబాద్ జిల్లాకు నలుగురు మంత్రులు

ఆదిలాబాద్ జిల్లాలో నేడు నలుగురు మంత్రులు పర్యటించనున్నారు. ఉట్నూరులో నిర్వహించే రైతు భరోసా ప్రజాభిప్రాయ సేకరణలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రి తుమ్మల, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి సీతక్క హాజరుకానున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణ తెలిపారు. మండల కేంద్రంలోని KB కాంప్లెక్స్ లో ఉ.10.30కు నిర్వహించే ఈ సభలో వీరు పాల్గొంటారు.
Similar News
News November 4, 2025
భీంపూర్ మండలంలో పులి సంచారం కలకలం..!

గత కొన్ని రోజులుగా భీంపూర్ మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. తాజాగా సోమవారం అంతర్గాం గ్రామస్థుల వ్యవసాయ పొలాల్లో పులి అడుగులు కనిపించాయని రైతులు తెలిపారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి అటవీ అధికారులు వివరాలు వెల్లడించాల్సి ఉంది.
News November 4, 2025
అతివలకు అండగా షీటీం బృందాలు: ADB SP

అతివలకు షీటీం అండగా ఉంటుందని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పాఠశాల, కళాశాల విద్యార్థినిలకు సైబర్ క్రైమ్, మహిళల వేధింపులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మహిళలు ఎలాంటి అత్యవసర పరిస్థితిలోనైనా డయల్ 100, 8712659953 నెంబర్ కి సంప్రదించవచ్చని సూచించారు. జిల్లాలోని హాట్స్పాట్ లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. గత నెలలో రెండు బాల్యవివాహాలు నిలిపివేయడం జరిగిందన్నారు
News November 3, 2025
బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు: ఎస్పీ

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం ఆదిలాబాద్ పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలనుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించి విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. మొత్తం 38 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఫోన్ ద్వారా సిబ్బందికి పరిష్కారం చూపాలని ఆదేశాలు ఇచ్చారు.


