News February 15, 2025
నేడు ఆదిలాబాద్ జిల్లాలో వారికి సెలవు..

శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న బంజారా ఉద్యోగ, ఉపాధ్యాయులకు శనివారం స్పెషల్ క్యాజువల్ సెలవు ఇస్తున్నట్ల ఉత్తర్వులు జారీ అయ్యాయని ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. బంజారా ఉపాధ్యాయ సోదరులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు.
Similar News
News March 27, 2025
దహెగాం: పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష రాసిన అనురాధ

కన్న తండ్రి మరణం.. మరోవైపు పరీక్ష.. బాధనంతటిని దిగమింగుకొని పరీక్ష రాసింది ఆమె. మనోధైర్యంతో సెంటర్‌కు వెళ్లి కన్నీటిచుక్కలను అక్షరాలుగా మలిచింది విద్యార్థిని అనురాధ. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం చౌక గ్రామానికి చెందిన రాజయ్య బుధవారం ఉదయం చనిపోయారు. రాజయ్య కుమార్తె అనురాధ అదే బాధలో కుటుంబీకులు ఇచ్చిన ధైర్యంతో పరీక్ష రాసి అనంతరం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొంది. ఆమె ఎంతో గ్రేట్ కదా..!
News March 27, 2025
ADB: శిక్షణ, ఉపాధి కోసం దరఖాస్తుల ఆహ్వానం

అదిలాబాద్ జిల్లాలోని ఎస్సీ, మైనార్టీ యువకులకు టెలి హెల్త్ సర్వీస్ కోఆర్డినేటర్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కోర్సులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఆర్డీఓ రవీందర్ రాథోడ్ తెలిపారు. హైదరాబాద్‌లో ఉచిత భోజన వసతులతో పాటు ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 30 సంవత్సరాల లోపు వయస్సు ఉండి ఆసక్తి గలవారు ఈ నెల 28న అన్ని ధ్రువీకరణ పత్రాలు, పాస్ ఫోటోలతో ఆదిలాబాద్ టీటీడీసీలో హాజరు కావాలని సూచించారు.
News March 27, 2025
ADB: జాతీయస్థాయి టోర్నీకి రితీక

బిహార్‌లో నేటి నుంచి 30 తేదీ వరకు జాతీయస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ టోర్నీ నిర్వహించనున్నారు. ఈ పోటీలకు తెలంగాణ బాలికల జట్టుకు ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారిణి జాబడే రితీక ఎంపికయ్యారు. జాతీయస్థాయి టోర్నీకి రితీక ఎంపికపై జిల్లా కబడ్డీ అసోసియేషన్ చీఫ్ గోడం నగేశ్, ఛైర్మన్ పాయల్ శంకర్, అధ్యక్షుడు రఘుపతి, ప్రధాన కార్యదర్శి రాష్ట్రపాల్ హర్షం వ్యక్తం చేశారు.