News December 16, 2024
నేడు ఆళ్లగడ్డకు మంచు మనోజ్, భూమా మౌనిక!

హీరో మంచు మనోజ్, భూమా మౌనిక నేడు ఆళ్లగడ్డకు రానున్నారు. ఇవాళ శోభానాగిరెడ్డి జయంతి కావడంతో ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారు వస్తున్నట్లు సమాచారం. భూమా ఘాట్‌లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ‘మంచు’ ఫ్యామిలీలో వివాదం నేపథ్యంలో వారి రాకపై ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యే అఖిలప్రియతో కలిసి వారు నివాళులు అర్పించనున్నట్లు సమాచారం.
Similar News
News December 15, 2025
కర్నూలు: అంగన్వాడీలకు ఫోన్లు ఇచ్చిన కలెక్టర్

కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి అంగన్వాడీ సిబ్బందికి శాంసంగ్ 5-జీ సెల్ఫోన్లు పంపిణీ చేశారు. సోమవారం కలెక్టర్ చాంబర్లో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఈ ఫోన్లను అందజేశారు. అంగన్వాడీ సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ ఫోన్లు ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
News December 15, 2025
కర్నూలు జిల్లాలో బదిలీ అయిన ఎస్ఐలు వీరే!

కర్నూలు రేంజ్లో 15 మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. ఏపీ శ్రీనివాసులు కర్నూల్ 4 టౌన్ నుంచి 3 టౌన్‌కు, హనుమంత్ రెడ్డి గూడూరు పీఎస్ నుంచి సీసీఎస్ కర్నూల్‌కు, శరత్ కుమార్ నాగలాపురం నుంచి కర్నూలు 4 టౌన్‌కు, ఎల్.శివాంజల్ మంత్రాలయం నుంచి సీసీఎస్‌కు, ఈ.మూర్తి హల్లహర్వి నుంచి DSB కర్నూల్‌కు, విజయ్ కుమార్ నాయక్ మద్దికేర నుంచి పత్తికొండ యూపీఎస్‌కు బదిలీ అయ్యారు.
News December 15, 2025
పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు జాతికి గుర్తింపు: కలెక్టర్ సిరి

తన ప్రాణత్యాగంతో తెలుగు జాతికి గుర్తింపునిచ్చిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌తో పాటు జిల్లా అధికారులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి శ్రద్ధాంజలి అర్పించారు.


