News April 25, 2024
నేడు ఇంటర్ ఫలితాలు.. ఉమ్మడి NZB నుంచి ఎంత మంది అంటే

నేడు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఉదయం 11 గంటలకు వెలువడనున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం కలిపి 35346 మంది విద్యార్థులు ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో కలిపి ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం కలిపి 19509 విద్యార్థులు ఉన్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను WAY2NEWS యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు. #ResultsFirstOnWay2News
Similar News
News October 17, 2025
NZB: ఫ్యాక్టరీలో గుట్కా తయారీ, ఇద్దరి అరెస్ట్

NZB శివారులో అక్రమంగా తయారు చేస్తున్న గుట్కాను CCS పోలీసులు పట్టుకున్నారు. జన్నెపల్లి రోడ్డులో ఓ ఫ్యాక్టరీలో సీసీఎస్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో గురువారం సోదాలు చేసి అక్కడ గుట్కా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. గుట్కా తయారీకి సంబంధించిన సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. అసాన్, అమీర్ అనే నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఫ్యాక్టరీలో పాన్ మసాలా ముసుగులో గుట్కా తయారు చేస్తున్నారు.
News October 17, 2025
NZB: 102 వైన్స్‌లకు దరఖాస్తులు ఎన్నంటే?

NZB జిల్లాలోని 102 వైన్ షాప్‌లకు సంబంధించి గురువారం వరకు 687 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. NZB ఫరిధిలోని మొత్తం 36 వైన్ షాపుల్లో 11 షాప్‌లకు 234 దరఖాస్తులు, BDN- మొత్తం18 వైన్ షాప్‌లకు 168, ARMR- 25 షాప్‌లకు 135, భీంగల్-12 వైన్ షాపులకు 65, మోర్తాడ్ పరిధిలో 11 వైన్ షాపులకు 85 దరఖాస్తులు వచ్చాయని ఆయన వివరించారు.
News October 17, 2025
NZB: ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఆహ్వానం

అక్టోబర్ 21 న పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆసక్తి గల విద్యార్థులు, యువత, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఎవరైనా సరే పోలీస్ సేవలు, త్యాగాలు, సమాజ రక్షణపై ఆధారంగా 3 ఫోటోలు లేదా 3 నిమిషాల షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కమీషనర్ సాయి చైతన్య ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 24లోపు కమీషనరేటు పోలీస్ కార్యాలయంలోని పోలీస్ పీఆర్వోకు అందజేయాలని తెలిపారు.