News April 25, 2024
నేడు ఇంటర్ ఫలితాలు..ఉమ్మడి ADB నుంచి ఎంత మంది అంటే..

నేడు ఇంటర్ ఫలితాలు ఉ.11 గంటలకు వెలువడనున్నాయి. MNCL జిల్లాలో 8394 మంది ఫస్ట్ ఇయర్, 7135 మంది సెకండ్ ఇయర్ పరీక్షలు రాశారు. ADB జిల్లాలో ఫస్ట్ ఇయర్ 10424, సెకండ్ ఇయర్ 9347, NRML ఫస్ట్ ఇయర్ 6535, సెకండ్ ఇయర్ 6810 మంది పరీక్షలు రాశారు. ASF జిల్లాలో ఫస్ట్ ఇయర్ 5423, సెకండ్ ఇయర్ 5003 మంది పరీక్షలు రాశారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను WAY2NEWS యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు. #ResultsFirstOnWay2News
Similar News
News January 9, 2026
ఆదిలాబాద్: 12న పీఎం నేషనల్ అప్రెంటిషిప్ మేళా

ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ కళాశాలల్లో ఈనెల 12న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు అప్రెంటిషిప్ మేళాను సద్వినియోగం చేసుకుంటే చదువుతూనే డబ్బులు సంపాదించవచ్చన్నారు. ఇతర రాష్ట్రాల్లోని కంపెనీల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.
News January 9, 2026
మావల: నకిలీ పత్రాలతో భూ కబ్జా.. నిందితుడి అరెస్టు

మావల పోలీస్ స్టేషన్ పరిధిలో భూమి పత్రాలు నకిలీ చేసి అక్రమంగా స్థలం ఆక్రమించిన కేసులో ప్రధాన నిందితుడు దుర్వ నాగేశ్‌ను అరెస్ట్ చేసినట్లు మావల సీఐ కర్ర స్వామి తెలిపారు. నకిలీ అమ్మకపు ఒప్పంద పత్రాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. పరారీలో ఉన్న సహ నిందితురాలి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. అమాయకుల వద్ద రూ.కోట్ల విలువైన భూమిని కబ్జాకు ప్రయత్నం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
News January 8, 2026
ఆదిలాబాద్: విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలుకల్పించాలి: కలెక్టర్

నార్నూర్ ఆస్పిరేషనల్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంగ్లీష్ ఫౌండేషన్ అభ్యాసన నైపుణ్యాలు, తదితర అంశాలపై విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఆంగ్ల భాషపై పట్టు సాధించడం ఎంతో అవసరమన్నారు.


