News January 26, 2025

నేడు ఈ గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు ప్రారంభం: వికారాబాద్ కలెక్టర్ 

image

నేడు వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నాలుగు ఈ గ్రామాల్లో ప్రారంభం కానున్నట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఆదివారం వికారాబాద్ జిల్లాలోని 20 మండలాల్లో సంక్షేమ పథకాలను అమలు చేసే మొదటి గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. అధికారులు పండగ వాతావరణం కల్పించి సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

Similar News

News November 27, 2025

రూ.200 కోట్లు పూచీకత్తు చెల్లించాలి: కలెక్టర్

image

జిల్లాలోని రైస్‌ మిల్లర్లు తప్పనిసరిగా బ్యాంకు పూచీకత్తు చెల్లించాలని బాపట్ల కలెక్టర్ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. బుధవారం
ఆయన కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో 74 మిల్లులు ఉండగా, రూ.200 కోట్లు పూచీకత్తు చెల్లించాలన్నారు. రైతులకు నష్టం లేకుండా ధాన్యం సేకరణ, ప్రతి మిల్లులో తేమ యంత్రాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. టాస్క్ ఫోర్స్ పర్యవేక్షణ ఉందన్నారు.

News November 27, 2025

పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: DEO

image

DEO కిరణ్ కుమార్ బుధవారం కొండేపి మండలంలోని ముప్పవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పదో తరగతి విద్యార్థులపై ప్రణాళికతో స్టడీ అవర్స్ నిర్వహించాన్నారు. విద్యార్థుల ఉత్తీర్ణతను పెంచే విధంగా కృషి చేయాలని సూచించారు.

News November 27, 2025

పాలకుర్తి: నువ్వా? నేనా? అన్నట్లుగా ఎన్నికలు!

image

పాలకుర్తి నియోజకవర్గంలో జరగబోయే స్థానిక ఎన్నికలు నువ్వా? నేనా? అన్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది. నియోజకవర్గంలో ఓడిపోయినప్పటికీ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిత్యం ప్రజల్లో ఉంటూ కార్యకర్తలను సమన్వయం చేస్తున్నారు. ఎమ్మెల్యే యశస్విని, అత్త ఝాన్సీ రెడ్డిలు సైతం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. ప్రజలతో మమేకమవుతున్నారు. ఎవ్వరు తగ్గేది లేదు అన్నట్టుగా ఉండటంతో నువ్వా? నేనా? అన్నట్టుగా ఉంది.