News September 25, 2024

నేడు ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో YS జగన్ భేటీ

image

ఉమ్మడి కృష్ణాజిల్లా వైసీపీ నేతలతో నేడు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం అవ్వనున్నారు. ఈ సమావేశానికి వైసీపీలో ఉన్న జిల్లా ఇన్‌ఛార్జులు హాజరవునుఉన్నట్లు సమాచారం. ఇటీవల జగ్గయ్యపేట వైసీపీ ఇన్‌ఛార్జ్ సామినేని ఉదయభాను జనసేనలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో జగ్గయ్యపేటకు నూతన ఇన్‌ఛార్జ్‌ను జిల్లాకు చెందిన దేవినేని అవినాశ్‌ను నియమించినట్లు సమాచారం.

Similar News

News December 1, 2025

కృష్ణా: తీరప్రాంత ప్రజలకు నెరవేరని మంచినీటి కల.!

image

తరాలు మారినా తమ తలరాతలు మాత్రం మారలేదంటూ సముద్ర తీరం ప్రాంతమైన కృత్తివెన్ను మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చి వెళ్లినా గుక్కెడు మంచినీరు అందించలేకపోయారని, ఇప్పటికీ కుళాయి నీరు అందక మినరల్ వాటర్ ప్లాంట్ నీరే శరణ్యంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు శుద్ధ జల సరఫరా జరుగుతుందనే ఆశతో చూస్తున్నాం అంటున్నారు.

News December 1, 2025

కృష్ణా జిల్లాలో యధావిధిగానే పాఠశాలలు: డీఈఓ

image

కృష్ణాజిల్లాలో సోమవారం యధావిధిగా పాఠశాలలు కొనసాగుతాయని డీఈఓ రామారావు తెలిపారు. దిత్వా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో ఇప్పటి వరకు భారీ వర్షాలు పడని కారణంగా పాఠశాలలను యధావిధిగా కొనసాగిస్తున్నామన్నారు. భారీ వర్షాలు పడితే కలెక్టర్ ఆదేశాల మేరకు ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. తీర ప్రాంత మండలాల్లో అక్కడి పరిస్థితులను బట్టి తహశీల్దార్లు స్కూల్స్ శెలవుపై నిర్ణయం తీసుకుంటారన్నారు.

News November 30, 2025

కృష్ణా జిల్లాలో 1.1మి.మీలు వర్షపాతం నమోదు

image

దిత్వా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో 1.1 మి.మీల సరాసరి వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతం ఆదివారం ఉదయం 8.30ని.ల నుంచి రాత్రి 8గంటల వరకు నమోదైనట్టు అధికారులు తెలిపారు. అత్యధికంగా నాగాయలంకలో 2.6 మి.మీలు, కోడూరులో 2.2మి.మీలు, అవనిగడ్డ, మోపిదేవిలలో 2.0మి.మీలు, చల్లపల్లి, కంకిపాడులలో 1.8మి.మీలు చొప్పున వర్షపాతం నమోదైంది.