News October 15, 2024

నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వర్ష సూచన

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకూ హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 18 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. SHARE IT

Similar News

News October 29, 2025

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఖమ్మం సీపీ

image

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో నీట మునిగిన రోడ్లను దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ఎవరు కూడా చేపల వేటకు వెళ్లవద్దని, పశువుల కాపర్లు చెరువులు, వాగులు దాటవద్దని, యువకులు సెల్ఫీల కోసం నీటి ప్రవాహం వద్దకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.

News October 29, 2025

భారీ వర్షాలు.. ఖమ్మం సీపీ కీలక సూచనలు

image

ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సీపీ సునీల్ దత్ సూచించారు. నీట మునిగిన రోడ్లు, వాగులు, వంతెనలు దాటే ప్రయత్నం చేయవద్దని, చేపల వేటకు వెళ్లవద్దని, సెల్ఫీల కోసం నీటి ప్రవాహం వద్దకు వెళ్లరాదని హెచ్చరించారు. అత్యవసర సమయాల్లో డయల్‌ 100, 1077 లేదా 87126 59111 నంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. చెరువులు, వాగుల వద్ద పోలీసులు పహారా పెంచారని ఆయన పేర్కొన్నారు.

News October 29, 2025

ఖమ్మం: పత్తి మార్కెట్‌కి సెలవు

image

‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డుకు నేడు (బుధవారం) సెలవు ప్రకటించినట్లు మార్కెట్ సెక్రటరీ ప్రవీణ్ రెడ్డి తెలిపారు. అపరాలు, మిర్చి కొనుగోళ్లు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. పత్తి క్రయవిక్రయాలు తిరిగి ఈ నెల 30న గురువారం పునఃప్రారంభమవుతాయని తెలిపారు. పత్తి విక్రయానికి రానున్న రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.