News April 25, 2024

నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో నామినేషన్లు వేసేది వీళ్లే..

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలువురు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బలసాని కిరణ్, ప్రత్తిపాడు కాంగ్రెస్ అభ్యర్థిగా కొరివి వినయ్ కుమార్, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, అన్నాబత్తుని శివకుమార్, మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జూలకంటి బ్రహ్మారెడ్డి, వినుకొండ టీడీపీ అభ్యర్థిగా జీవీ ఆంజనేయులు, గురజాల వైసీపీ అభ్యర్థిగా కాసు మహేష్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. 

Similar News

News December 4, 2025

అమరావతి: బ్లడ్ టెస్టుల పేరుతో భారీగా వసూళ్లు

image

అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రైవేటు రక్త పరీక్షా కేంద్రాలు రక్తాన్ని పీల్చినట్లు సామాన్యుల నుంచి డబ్బులు లాగేస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులు రోగనిర్ధారణ టెస్టుల పేరుతో రక్త పరీక్షలు చేయించాలని, కమిషన్లకు కక్కుర్తి పడి ప్రైవేట్ ల్యాబ్‌లకు సిఫార్సు చేస్తున్నారని ప్రజలు అంటున్నారు. అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని, అధికారుల తనిఖీలు కరువయ్యాయని వాపోతున్నారు. మీ ఏరియాలో పరిస్థితిపై కామెంట్ చేయండి.

News December 4, 2025

GNT: మారువేషంలో మార్చూరీని పరిశీలించిన సూపరింటెండెంట్.!

image

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణ యశస్వి మరోసారి మారువేషంలో ఆసుపత్రిలోని అడ్మినిస్ట్రేషన్ తీరును పరిశీలించారు. ఈసారి ఆయన టీషర్ట్, మడత వేసిన ప్యాంటు, మాస్క్, మంకీ క్యాప్ ధరించి మార్చూరీ బయట సాధారణ వ్యక్తిలా ఒక గంటపాటు కూర్చున్నారు. అక్కడే ఉండి, మృతదేహాల బంధువులతో మాట్లాడి, మార్చూరీలోని పరిస్థితులను అధ్యయనం చేశారు.

News December 4, 2025

దుగ్గిరాలలో క్వింటాల్ పసుపు ధర ఎంతంటే.!

image

దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటాల్ పసుపు రూ.12,500 గరిష్ఠ ధర పలికింది. యార్డులో గురువారం నిర్వహించిన వేలంలో పసుపు కొమ్ముల ధర రూ.8,500 నుంచి రూ.12,500 పలకగా కాయ రకం పసుపు ధర రూ. 8,550 నుంచి రూ.12,500 వరకు పలికినట్లు అధికారులు తెలిపారు. రైతులు యార్డుకు తెచ్చిన పసుపు పంటలో 684 బస్తాలను వ్యాపారులకు విక్రయించారు.