News May 20, 2024
నేడు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న కేటీఆర్

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి 10 గంటలకు కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందుకు చేరుకుంటారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఇల్లందు సింగరేణి జేకే గ్రౌండ్లో జరిగే పట్టభద్రుల ఓటర్ల సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారు.
Similar News
News November 26, 2025
అటవీ పరిరక్షణకు కమ్యూనిటీల మద్దతు అవసరం: డీఎఫ్ఓ

అటవీ సంరక్షణ చర్యలలో కమ్యూనిటీలు, స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీఓలు) భాగస్వామ్యం కావడాన్ని డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ (ఐఎఫ్ఎస్) స్వాగతించారు. ఖమ్మం అటవీ శాఖతో కలిసి పనిచేయడానికి వాలంటీర్లు ముందుకు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కమ్యూనిటీ భాగస్వామ్యం వలన పరిరక్షణ చర్యలు మరింత బలోపేతం అవుతాయని డీఎఫ్ఓ తెలిపారు.
News November 26, 2025
ఖమ్మం: పార్టీల మద్దతు కోసం ఆశావాహుల క్యూ

ఖమ్మం జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు పార్టీల సింబల్స్ లేకుండానే ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో పార్టీల మద్దతు కోరుతూ ఆశావాహులు ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకుల వద్దకు క్యూ కడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో చేసిన సేవను గుర్తుచేస్తూ, పార్టీల సపోర్ట్ ఉంటేనే గెలిచే అవకాశాలు ఉంటాయని భావించి, అభ్యర్థులు బలపరుచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
News November 26, 2025
ఖమ్మం: కూటమిగా ఉండేందుకు సన్నాహాలు

ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తాయని పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆయా పార్టీల స్థానిక నేతలు కూడా కూటమిగా బరిలో దిగాలని మంతనాలు చేస్తున్నారట. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్కు టీడీపీ ఓటింగ్ క్రాస్ కాగా ప్రస్తుతము టీడీపీ కూటమిలో ఉండటంతో తెలంగాణ అధిష్ఠానం ఆదేశాలు కోసం ఎదురు చూస్తున్నారట.


