News December 4, 2024
నేడు ఉమ్మడి జిల్లాలో NAS పరీక్ష

సంగారెడ్డి జిల్లాలో 101 పాఠశాలలో బుధవారం NAS పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ పరీక్ష నిర్వహించడానికి 101 మంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లను నియమించామని, ప్రతి పాఠశాలకు ఒక అబ్జర్వర్ ఉంటారని పేర్కొన్నారు. పాఠశాల హెచ్ఎంలు పరీక్ష ప్రశాంతంగా జరిగే విధంగా చూడాలని కోరారు.
Similar News
News January 5, 2026
మెదక్: 1978-94 వరకు చదివిన విద్యార్థులు ఒకే చోట

మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో 1978 నుంచి 1994 వరకు విద్యాభ్యాసం చేసిన 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థినుల సమ్మేళనం ఆదివారం పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 350 మంది పూర్వ విద్యార్థినులు పాల్గొన్నారు. సఖీ సంఘ్ పేరిట నిర్వహించిన పూర్వ విద్యార్థినుల సమ్మేళానాన్ని డి.మధుర స్మిత్, డాక్టర్ చల్లా గీత, సీహెచ్.శ్రీదేవీ, రిటైర్డ్ హెడ్ మాస్టర్ పొద్దార్ రేఖ పర్యవేక్షించారు.
News January 5, 2026
మెదక్: నేటి నుంచి మండల కేంద్రాల్లో ప్రజావాణి: కలెక్టర్

మెదక్ జిల్లా కేంద్రంతో పాటు మండల తహశీల్, ఎంపీడీవో, ఆర్డీవో కార్యాలయాల్లో కూడా సోమవారం నుంచి ప్రజావాణి నిర్వహించేందుకు కలెక్టర్ రాహుల్ రాజ్ వినూత్న ఆలోచన చేశారు. ఈ సోమవారం కలెక్టర్ స్వయంగా రేగోడ్ మండల కేంద్రంలో నిర్వహించే ప్రజావాణిలో హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులు పాల్గొంటున్న విషయం తెలిసిందే.