News July 28, 2024
నేడు ఉమ్మడి తూ.గో జిల్లాలో మంత్రి అచ్చెన్న పర్యటన

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పలు మండలాల్లో పర్యటిస్తారని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మంత్రి పర్యటన మొదలవుతుందన్నారు. ఉండ్రాజవరం, నిడదవోలు, రామచంద్రపురం, కె.గంగవరం, సీతానగరం మండలాల్లోని గోదావరి వరద ముంపు ప్రాంతాలను పరిశీలిస్తారని పేర్కొన్నారు. నష్టపోయిన పంటల వివరాలు, బాధితుల కష్టాలు తెలుసుకోనున్నారు.
Similar News
News November 18, 2025
రాజమండ్రి: ‘ప్రశాంతంగా 10 పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేయాలి’

రానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను విద్యార్థులు ప్రశాంతంగా రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అసిస్టెంట్ కమిషనర్ ఫర్ ఎగ్జామినేషన్స్ ఎం. అమల కుమారి అధికారులకు సూచించారు. సోమవారం ఆమె రాజమండ్రిలోని కంటిపూడి రామారావు మున్సిపల్ స్కూల్లోని పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. మరుగుదొడ్లు, తాగునీరు, ఇతర సదుపాయాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ రేంజ్ డీఐ దిలీప్ కుమార్ పాల్గొన్నారు.

News November 17, 2025
ధాన్యం కొనుగోలు డబ్బులు 48 గంటల్లో జమ: జేసీ

ధాన్యం విక్రయించిన 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో మద్దతు ధర నేరుగా జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా జేసీ వై. మేఘా స్వరూప్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 3,240 మంది రైతులకు రూ.55.82 కోట్లు జమ చేసినట్లు సోమవారం రాజమండ్రిలో ఆయన వివరించారు. రైతులకు ఏ సమస్య ఎదురైనా వెంటనే 8309487151 నంబర్‌కు కాల్ చేసి తమ సందేహాలు, ఫిర్యాదులను తెలియజేయవచ్చని సూచించారు.