News June 21, 2024

నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

image

ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి టీడీపీ తరఫున 10 మంది ఎమ్మెల్యేలు, వైసీపీ తరఫున ఇద్దరు ఎమ్మెల్యేలు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. ఈ 12 మంది ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమ ఎమ్మెల్యే నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల ప్రజలు అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Similar News

News September 10, 2024

ప్రకాశం: దారుణం.. చిన్నారిపై బాబాయి అత్యాచారం!

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం మన్నేటికోటలో దారుణం జరిగింది. 9 ఏళ్ల చిన్నారిపై వరుసకు బాబాయి అయ్యే వ్యక్తి మానవ మృగంలా అరాచకానికి పాల్పడ్డాడు. తినుబండారాల పేరుతో మాయమాటలు చెప్పి చిన్నారిని తీసుకెళ్లిన కార్తీక్ (20) అత్యాచారానికి తెగబడ్డాడు. బాలిక కేకలు వేయడంతో ఆ కీచకుడు పరారయ్యాడు. ఫిర్యాదు అందుకున్న ఉలవపాడు పోలీసులు చిన్నారిని కందుకూరు ఆసుపత్రికి తరలించారు.

News September 10, 2024

అద్దంకి : ఇద్దరు మంత్రుల చొరవ.. రాత్రికి రాత్రే రక్ష

image

భారీ వర్షాలు, వరదలకు బాపట్ల జిల్లాలోని పెదపులివర్రు, పెనుమూడి, రుద్రవరం, రావిఅనంతారం గ్రామాల్లో కుడికరకట్ట చాలాచోట్ల బలహీనపడింది. దీంతో మంత్రులు అనగాని, గొట్టిపాటి అధికారులతో చర్చించి పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికుల సాయంతో 100కి పైగా ట్రాక్టర్ల మట్టిని 15వేలకుపైగా బస్తాల్లో నింపి రాత్రికి రాత్రి కరకట్టపై రక్షణ కవచంలా ఏర్పాటు చేశారు.

News September 10, 2024

ముండ్లమూరు: బాలికపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

image

ముండ్లమూరు మండలం మారెళ్ళకు చెందిన ఓ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసి గర్భివతిని చేసిన కేసులో నిందితుడు శ్రీరామ్ జాన్ హైడ్ (చెర్రీ)ని అరెస్ట్ చేసినట్లు దర్శి DSP లక్ష్మీనారాయణ తెలిపారు. గత నెల 20న బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై నాగరాజు కేసు నమోదుచేశారు. అప్పటినుంచి నిందితుడు తప్పించుకొని తిరుగుతుండగా సోమవారం అరెస్ట్ చేసినట్లు వివరించారు.