News January 26, 2025

నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సీఎం

image

నేడు ఉమ్మడి కొడంగల్‌లోని కోస్గిలో సీఎం పర్యటించనున్నారు. సీఎం సొంత నియోజకవర్గం నుంచి ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పథకాలను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో  ముగ్గురు అదనపు SPలు, ఆరుగురు DSPలు, 13 మంది CIలు, 26 మంది SIలు, ASIలు, 30 మంది HCలు, 120 మంది PSలు, 30 మహిళ హోంగార్డులు, 35 మంది హోంగార్డులు మొత్తం 261 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Similar News

News September 17, 2025

రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మిరాయ్’

image

తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ‘మిరాయ్’ మూవీ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. మొదటి 4 రోజుల్లో రూ.91.45 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ చిత్రంలో మంచు మనోజ్, శ్రియ కీలక పాత్రలు పోషించగా విశ్వ ప్రసాద్ నిర్మించారు.

News September 17, 2025

జగిత్యాల: జడ్జి, ఎస్పీని కలిసిన అడిషనల్ కలెక్టర్

image

జగిత్యాల జిల్లా జడ్జి రత్న పద్మావతిని, ఎస్పీ అశోక్ కుమార్ ను అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) రాజా గౌడ్ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి ఆయన పుష్పగుచ్ఛం అందజేశారు. ఇటీవల నూతనంగా అడిషనల్ కలెక్టర్ గా నియమితులైన ఆయనకు వారు శుభాకాంక్షలు తెలిపారు.

News September 17, 2025

జగిత్యాల: నవంబర్‌లో డీఈఐఈడీ, డీపీఎస్ఈ పరీక్షలు

image

2024-26 బ్యాచ్‌కు చెందిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లోమా ఇన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ మొదటి సంవత్సరం పరీక్షలు నవంబర్ లో నిర్వహించబడతాయని జిల్లా విద్యాధికారి రాము తెలిపారు. లేట్ ఫీజు లేకుండా ఈనెల 22లోగా ప్రిన్సిపల్‌కు ఫీజులు చెల్లించవచ్చన్నారు. 50 రూపాయల లేట్ ఫీజ్ తో ఈనెల 29 వరకు ఫీజులు చెల్లించవచ్చన్నారు. ఆన్లైన్ లో అయితే లేట్ ఫీజు లేకుండా 23లోగా లేట్ ఫీజు తో 30లోగా చెల్లించాలన్నారు.