News November 11, 2024
నేడు ఉమ్మడి మెదక్ జిమ్నాస్టిక్ ఎంపికలు
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో ఈనెల 12న కొల్లూరులోని గార్డియన్ స్కూల్లో ఉమ్మడి జిల్లా జిమ్నాస్టిక్ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అమూల్యమ్మ ఆదివారం తెలిపారు. అండర్ 14, 17 బాలుర, బాలికలు ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఒరిజినల్ బోనాఫైడ్ సర్టిఫికేట్‌తో ఉదయం 9 గంటల వరకు హాజరు కావాలని కోరారు.
Similar News
News December 5, 2024
సిద్దిపేట: యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలి
యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ అన్నారు. సిద్దిపేట పట్టణంలోని నెక్లెస్ రోడ్డులో ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా యోగా శిక్షణ కార్యక్రమాన్ని మునిసిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యోగా శిక్షణతో పాటు పోటీలను నిర్వహించారు. వారితో మునిసిపాలిటీ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
News December 5, 2024
మెదక్: వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు. వివరాలిలా.. హవేళిఘణాపూర్ మండలం సుల్తానాపూర్‌కు చెందిన నీల(40) మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి ఔరంగాబాద్ శివాలరులో మృతదేహం లభ్యమైంది. గజ్వేల్ పానీపూరి బండి నడుపుతున్న వ్యక్తి కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. బెజ్జంకికి చెందిన ఉపాధ్యాయుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కాగా బుధవారం తోటపల్లి చెరువు వద్ద అనుమానాస్పందగా మృతిచెందాడు.
News December 5, 2024
జిన్నారం: క్వారీ గుంతలో పడి వ్యక్తి గల్లంతు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో క్వారీ గుంతలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. జీఎంఆర్ కాలనీకి చెందిన చిట్యాల రఘు, చిట్యాల రవి స్నానం చేయడానికి క్వారీకి వెళ్లారు. ప్రమాదవశాత్తు రవి నీటి గుంతలో పడి మునిగిపోయాడు. గజ ఈతగాల్లతో వెతకించినా ఆచూకీ లభించలేదు. కేసు నమోదైంది.