News April 15, 2025
నేడు ఉమ్మడి NZB జిల్లాకు ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్సీ కవిత ఉమ్మడి NZB జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో పాల్గొంటారు. అనంతరం బోధన్లో మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ వెంకటేశ్వర్ దేశాయి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు డిచ్పల్లిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Similar News
News November 18, 2025
MBNR: పీయూలో “నషా ముక్త్ భారత్ అభియాన్”

పాలమూరు విశ్వవిద్యాలయం విద్యా కళాశాలలో “నషా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి తన సందేశంలో యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ మాళవి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ అనురాధ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
News November 18, 2025
X(ట్విటర్) డౌన్

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X(ట్విటర్) డౌన్ అయింది. ట్వీట్లు చేయలేకపోతున్నామని యూజర్లు ఇతర SM పేజీల్లో కామెంట్లు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇదే తరహా ఆటంకం ఏర్పడినట్లు తెలుస్తోంది. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? COMMENT
News November 18, 2025
GWL: మాదక ద్రవ్యాలతో మనుగడకు ముప్పు-DMHO

మాదక ద్రవ్యాలతో మానవ మనుగడకు ముప్పు వాటిల్లుతుందని గద్వాల జిల్లా వైద్యాధికారి సంధ్యా కిరణ్మయి పేర్కొన్నారు. మంగళవారం కార్యాలయంలో వైద్య సిబ్బందికి మాదక ద్రవ్యాలతో కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం చట్టరీత్యా నేరమన్నారు. మద్యం మత్తు జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు. ఎక్కడైనా మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.


