News January 30, 2025
నేడు ఎంజీఎంలో గుండె వైద్య శిబిరం

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో గురువారం ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సంయుక్తంగా పిల్లలకు గుండె పరీక్షల వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. గుండె సంబంధిత సమస్యలు చిన్నారులకు ఉచితంగా 2డీ ఎకో పరీక్షలు నిర్వహిస్తారని, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయన్నారు. జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్ఓ సాంబశివరావు కోరారు.
Similar News
News October 26, 2025
పోలీసుల ఎదుట 21 మంది మావోయిస్టుల లొంగుబాటు

చర్ల: తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లోని బస్తర్ రేంజ్ కాంకేర్ జిల్లాలో 21 మంది మావోయిస్టులు ఆయుధాలతో పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 13 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. మొత్తం 18 ఆయుధాలను మోసుకెళ్లిన ఈ 21 మంది మావోయిస్టులు జన స్రవంతిలో చేరారు. వీరందరూ కేశ్కల్ డివిజన్లోని కుమారి/కిస్కోడో ఏరియా కమిటీకి చెందినవారు. వీరిలో డివిజన్ కార్యదర్శి ముఖేష్ కూడా ఉన్నాడు.
News October 26, 2025
ఎస్.రాయవరం: ‘అధికారులు అప్రమత్తంగా ఉండాలి’

తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్న కారణంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీనియర్ ఐఏఎస్ అధికారి వినయ్ చంద్ ఆదేశించారు. ఆదివారం ఎస్.రాయవరం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే ప్రజలను కూడా అప్రమత్తం చేయాలన్నారు. ఎటువంటి పరిస్థితులైన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సమీక్షలో MPDO మీనాకుమారి, డిప్యూటీ MPDO బంగారు సత్యనారాయణ పాల్గొన్నారు.
News October 26, 2025
పర్చూరు: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

పర్చూరు మండలం చెన్నంబొట్ల అగ్రహారం సమీపంలోని చెరువులో ఆదివారం గుర్తు తెలియని మృతదేహం కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్థుల సమాచారంతో పర్చూరు ఎస్సై జీవి చౌదరి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని వెలికి తీయించి, పర్చూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై జీవీ చౌదరి తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


