News March 22, 2025

నేడు ఎర్త్ అవర్ పాటించాలి: పార్వతీపురం కలెక్టర్

image

పార్వతీపురం జిల్లాలో ప్రజలందరూ శనివారం ఎర్త్ అవర్ పాటించాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాత్రి 8.30 నుంచి 9.30 వరకు ఎర్త్ అవర్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేసారు. ఇవాళ రాత్రి 8.30 గంటలకు ప్రజలందరూ ఇళ్లల్లో లైట్లు ఆపివేయాలన్నారు. వరల్డ్ వైల్డ్ ఫండ్ ఫర్ నేచర్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఎర్త్ అవర్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News March 28, 2025

అల్లూరి జిల్లాలో భానుని ప్రతాపం

image

అల్లూరి జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. అడ్డతీగల, చింతూరు, దేవీపట్నం, గంగవరం, కొయ్యూరు, కూనవరం, రాజవొమ్మంగి, రంప, వీఆర్ పురంలో రాబోయే 48 గంటలు 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కానుంది. దీంతో ఆ మండల వాసులు తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

News March 28, 2025

ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఏపీ ప్రొఫెసర్

image

APకి చెందిన ఫిజిక్స్ ప్రొఫెసర్, VSU వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాస రావు ప్రపంచ దిగ్గజ శాస్త్రవేత్తలలో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రపంచంలోని టాప్ 2% శాస్త్రవేత్తలలో ఒకరిగా ఆయన నిలిచినట్లు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో వెల్లడైంది. భౌతిక శాస్త్ర రంగానికి ఆయన చేసిన కృషికి దక్కిన ఫలితం ఇది. ఆయన వివిధ అంతర్జాతీయ జర్నల్స్‌కు 250కి పైగా శాస్త్రీయ వ్యాసాలు రాసి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు.

News March 28, 2025

భార్యను తీసుకురావడానికి వెళ్తూ.. భర్త మృతి

image

భార్యను ఇంటికి తీసుకురావడానికి బైక్ పై వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందిన ఘటన సత్తుపల్లి పట్టణం శివారులో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లికి చెందిన మట్ల వెంకటేశ్వరరావు (35) భార్య భవాని సత్తుపల్లిలోని జీవి మాల్‌లో పనిచేస్తుంది. ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు వస్తుండగా ఓ పానీపూరి బండిని ఢీకొట్టాడు. సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

error: Content is protected !!