News February 19, 2025

నేడు ఏలూరు జిల్లాలో జర్మన్ ప్రతినిధుల పర్యటన

image

ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించేందుకు జర్మన్ ప్రతినిధి బృందం ఏలూరు జిల్లాలో బుధవారం పర్యటించనుంది. నలుగురు సభ్యులతో కూడిన ఈ బృందం ఏలూరు, కామవరపుకోట, ద్వారకాతిరుమల మండలాల్లో పర్యటిస్తారు. పంట పొలాలను పరిశీలిస్తారు. ఇక్కడి సాగు వివరాలను తెలుసుకుంటారు.

Similar News

News November 15, 2025

మార్గశిర ఉత్సవాలకు దేవదాయ శాఖ మంత్రికి ఆహ్వానం

image

బురుజుపేటలో కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలకు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఆలయ ఈవో శోభారాణి ఆహ్వానించారు. విజయవాడలో శనివారం ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. లక్షలాదిగా వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని వసతి, రక్షణ, పారిశుద్ధ్యం, క్యూలైన్లు, పార్కింగ్, దర్శనం ఏర్పాట్లు, తాగునీరు, వైద్య సౌకర్యాలు, తదితర అంశాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రికి ఈవో వివరించారు.

News November 15, 2025

రాగల ఐదు రోజులు జిల్లాలో పొడి వాతావరణం

image

హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి వచ్చిన సమాచారం మేరకు రాగల ఐదు రోజులు జిల్లాలో పొడి వాతావరణ ఉంటుందని నోడల్ ఆఫీసర్ హరీష్ కుమార్ శర్మ తెలిపారు. గరిష్ట పగటి ఉష్ణోగ్రత 31-32°C రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 18-19°C ఉంటుందన్నారు. ఈ వాతావరణంలో యాసంగి పంటగా శనగ, కుసుమ, ఆవాలు, బొబ్బర్లు విత్తుకోవచ్చని సూచించారు. యాసంగి పంటగా పొద్దు తిరుగుడు వేసుకోవడానికి డిసెంబర్ వరకు అనుకూలమన్నారు.

News November 15, 2025

NZB: జిల్లా ప్రజలకు సీపీ పలు సూచనలు!

image

జిల్లా ప్రజలకు సీపీ సాయి చైతన్య పలు సూచనలు చేస్తూ శనివారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇందులో భాగంగా ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాలలో విగ్రహ ప్రతిష్టలు, రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకూ డీజే పూర్తిగా నిషేధం అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొద్దన్నారు. డ్రోన్స్ ఉపయోగించడానికి & భారీ సభలకు ముందస్తు అనుమతి తప్పనిసరి తీసుకోవాలని కోరారు. నకిలీ గల్ఫ్ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.