News February 19, 2025

నేడు ఏలూరు జిల్లాలో జర్మన్ ప్రతినిధుల పర్యటన

image

ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించేందుకు జర్మన్ ప్రతినిధి బృందం ఏలూరు జిల్లాలో బుధవారం పర్యటించనుంది. నలుగురు సభ్యులతో కూడిన ఈ బృందం ఏలూరు, కామవరపుకోట, ద్వారకాతిరుమల మండలాల్లో పర్యటిస్తారు. పంట పొలాలను పరిశీలిస్తారు. ఇక్కడి సాగు వివరాలను తెలుసుకుంటారు.

Similar News

News April 17, 2026

సోలార్ దరఖాస్తుల్లో గుంటూరు జోరు!

image

పీఎం సూర్యఘర్ కింద సోలార్ ప్యానెళ్ల కోసం గుంటూరులో ఏకంగా 1.22 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీలకు ఈ యూనిట్లు ఉచితం. ఇతరులకు కేంద్రం రూ. 60 వేల రాయితీ ఇస్తోంది. దరఖాస్తుల్లో 30 శాతం వరకు బీసీలవే ఉన్నాయి. అయితే వీరికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రూ. 20 వేల సబ్సిడీ ప్రకటించింది. ఈ ప్రత్యేక రాయితీ మార్గదర్శకాల కోసం గుంటూరు లబ్ధిదారులు ఆసక్తిగా వేచిచూస్తున్నారు.

News April 17, 2026

ట్రంప్‌ ప్రకటనలపై ఇరాన్ మీడియా ఎగతాళి!

image

ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామన్న <<19670282>>ట్రంప్ ప్రకటన<<>>లను ఆ దేశ మీడియా ఎగతాళి చేసింది. ట్రంప్ మాటలు ‘గాల్లో మేడలు కట్టడం’ లాంటివని ఎద్దేవా చేసింది. ట్రంప్ ఆశలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని పేర్కొంది. చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోయినా, ఒప్పందం జరిగిపోయిందంటూ ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారని స్పష్టం చేసింది. అలాగే యురేనియం అప్పగిస్తామన్న మాటల్లోనూ నిజం లేదని తెలిపింది.