News April 7, 2024

నేడు ఐనవోలు మల్లన్న ఆలయంలో పెద్దపట్నం

image

ఐనవోలు మల్లికార్జునస్వామి అలయంలో ఆదివారం పెద్దపట్నంను వైభవంగా నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలి రానుండడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలోనే అత్యంత పెద్దపట్నం వేస్తున్నట్లు ఈవో అద్దంకి నాగేశ్వర్ రావు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా 100 మంది పోలీసులతో భద్రత నిర్వహిస్తున్నట్లు పర్వతగిరి సీఐ శ్రీనివాస్ తెలిపారు.

Similar News

News October 8, 2024

బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించిన మంత్రి సురేఖ

image

ఆలంపూర్లోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానాన్ని మంత్రి కొండా సురేఖ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి సురేఖకు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కాసేపు మంత్రి చర్చించారు. స్థానిక నేతలు పాల్గొన్నారు.

News October 8, 2024

వరంగల్ మార్కెట్లో చిరుధాన్యాల ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పలు రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ రూ.6100 ధర పలకగా, పచ్చి పల్లికాయ ధర రూ.4,000 పలికింది. మరోవైపు 5531 రకం మిర్చికి రూ. 14వేలు ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. కాగా ఫలితాలను గత వారంతో పోలిస్తే నేడు స్వల్పంగా పెరిగినట్లు రైతులు పేర్కొన్నారు.

News October 8, 2024

గౌరవ వందనం స్వీకరించిన మంత్రి కొండా సురేఖ

image

జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనకు వెళ్లిన మంత్రి కొండా సురేఖకు స్థానిక కలెక్టర్ సంతోశ్, ఎస్పీ శ్రీనివాసరావు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కొండా సురేఖ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై కాసేపు ప్రజాప్రతినిధులతో మంత్రి కొండా సురేఖ చర్చించారు.