News June 26, 2024
నేడు ఓటేయనున్న శ్రీకాకుళం ఎంపీ

పార్లమెంట్లో నేడు లోక్‌సభ స్పీకర్ ఎలక్షన్ జరగనుంది. శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 11 గంటలకు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహిస్తారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాకు ఓటేయనున్నారు.
Similar News
News December 20, 2025
శ్రీకాకుళం: ‘పోలియో విజయవంతం చేయాలి’

రేపు జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా ప్రజలందరూ విజయవంతం చేయాలని శ్రీకాకుళం DM&HO అనిత పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆమె కార్యాలయ నుంచి ఏడూ రోడ్ల కూడలి వరకు ర్యాలీ ప్రారంభించారు. 0 – 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించాలన్నారు. శతశాతం లక్ష్యం సాధించేలా కృషిచేయాలన్నారు. మోబైల్ టీమ్‌లు ప్రత్యేక బృందాలు కూడా ఉన్నాయన్నారు.
News December 20, 2025
SKLM: RTC డోర్ డెలివరీ పార్సిల్ ప్రారంభం

ఆర్టీసీ సంస్థలో పార్సిల్ డోర్ డెలివరీ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ కార్గో పార్సిల్ కౌంటర్ వద్ద శనివారం ప్రారంభించారు. 50 కేజీల బరువున్న పార్సిల్ 10 కిలోమీటర్లు దూరం పరిధిలో ఉన్న స్థలాలకు సురక్షితంగా పంపించడం జరుగుతుందన్నారు. ఈ నెల 20 నుంచి జనవరి 19 వరకు డోర్ డెలివరీ మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 84 పట్టణాల్లో ఈ సేవలను ప్రారంభించాన్నారు.
News December 20, 2025
శ్రీకాకుళం: హాట్ హాట్‌గా జడ్పీ సర్వసభ్య సమావేశం

శ్రీకాకుళంలో జడ్పీ సర్వసభ్య సమావేశం హాట్ హాట్‌గా సాగుతోంది. ఉపాధి హామీ నిధుల వినియోగం, సచివాలయాలు, RBKల నిర్మాణాల పనుల బిల్లులు రాలేదని సభ్యులు ప్రశ్నించగా సంబంధిత అధికారులు బిల్లులు వచ్చాయని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే కూన రవికుమార్ కలగజేసుకున్నారు. అయితే కేవలం వైసీపీనే టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ సభ్యులు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. పరస్పర ఆరోపణలతో సభ హీట్ ఎక్కింది.


