News February 26, 2025
నేడు ఓర్వకల్లుకు ప్రముఖ లేడీ సింగర్ రాక

ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలోని శ్రీ భ్రమరాంబ సమేత బుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో బుధవారం శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఆధ్వర్యంలో నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ సింగర్ మధుప్రియ, పల్సర్ బైక్ ఝాన్సీ, రమేశ్ బృందం సందడి చేయనుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
Similar News
News December 6, 2025
KMR: బుజ్జగింపు పర్వం సక్సెస్ అయ్యేనా?

KMR జిల్లాలో 2వ విడత నామినేషన్ల ఉపసంహరణకు కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రధాన పార్టీలకు సొంత పార్టీ రెబల్స్, స్వతంత్ర అభ్యర్థుల నుంచి ముప్పు పొంచి ఉంది. వారిని బుజ్జగించి పోటీ నుంచి తప్పించేందుకు బడా నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే ఈ రణరంగంలో ఉండేదేవరు? ఊడేదెవరు అన్నది పలు చోట్ల ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రెబల్స్ బెట్టు వీడతారా? లేక ఇండిపెండెంట్‌గా సై అంటారా? ఇవాళ సాయంత్రం వరకు ఈ ఉత్కంఠ తప్పదు!
News December 6, 2025
నితీశ్ కొడుకు రాజకీయాల్లోకి రావొచ్చు: JDU నేత

బిహార్ CM నితీశ్‌కుమార్ తనయుడు నిశాంత్ త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. JDU జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్‌కుమార్ వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. “పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. నిర్ణయం మాత్రం ఆయనదే” అని అన్నారు. ఇటీవల ఎన్నికల్లో నిశాంత్ పోటీ చేయకపోయినా కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
News December 6, 2025
మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

AP: తూర్పుగోదావరి జిల్లాలోని మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలో 12 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. కేస్ వర్కర్, MTS, సోషల్ వర్కర్, ఎడ్యుకేటర్, కుక్, సైకో-సోషల్ కౌన్సెలర్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, PG, సైకాలజీ డిప్లొమా/న్యూరో సైన్స్ , LLB, B.Sc. B.Ed, టెన్త్, ఏడో తరగతి అర్హతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్: eastgodavari.ap.gov.in


