News December 7, 2024

నేడు కడపకు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఇదే.!

image

నేడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కడపకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఉయదం 9:5కి బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో బయలుదేరి 10:15కి కడప ఎయిర్‌కి వస్తారు. అక్కడినుంచి నగరంలోని అన్నమయ్య సర్కిల్ సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం ముగిశాక 1:25కి కడప ఎయిర్ పోర్టుకు చేరుకుని 2:15కి బేగంపేటలో దిగుతారు.

Similar News

News November 7, 2025

నేడు కడపలో భారీ ర్యాలీ

image

WWC భారత్ గెలిచిన తర్వాత తొలిసారి కడపకు నల్లపురెడ్డి శ్రీచరణి నేడు రానున్నారు. కడప క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఆమెకు ఇర్కాన్ సర్కిల్ వద్ద సాయంత్రం స్వాగతం పలుకుతారు. తర్వాత హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఏడు రోడ్ల మీదుగా రాజారెడ్డి క్రికెట్ స్టేడియం వరకు భారీ ర్యాలీ చేస్తారు. రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో ఆమెను సన్మానిస్తారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్న ఆమె సాయంత్రానికి కడపకు వస్తారు.

News November 7, 2025

కడప: వేలంలోకి శ్రీచరణి

image

మన కడప అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి వుమెన్స్ వరల్డ్‌కప్‌లో సత్తాచాటిన విషయం తెలిసిందే. కప్ గెలవడంలో తనవంతు పాత్ర పోషించింది. అయినప్పటికీ WPLలో ఆమెను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రిటైన్ చేసుకోలేదు. దీంతో త్వరలో జరగనున్న WPL-2026 వేలంలోకి శ్రీచరణి రానుంది. గత సీజన్‌లో ఆమెకు ఢిల్లీ జట్టు రూ.55 లక్షలు చెల్లించగా.. వేలంలో రూ.కోట్లలో ధర దక్కే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు.

News November 7, 2025

సెలవులు రద్దు: కడప DEO

image

సెలవులపై కడప DEO షంషుద్దీన్ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్, 2026 ఫిబ్రవరి నెలలోని రెండో శనివారం సెలవులు రద్దు చేశామని చెప్పారు. ఈ మూడు నెలల్లోని ఆయా శనివారాల్లో స్కూళ్లు ఓపెన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ నేపథ్యంలో గత నెలలో వరుస సెలవులు ఇచ్చారు. ఈక్రమంలో ఈ మూడు సెలవులను వర్కింగ్ డేస్‌గా ప్రకటించారు.