News December 28, 2024
నేడు కడపకు రానున్న పవన్ కళ్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం కడపకు రానున్నారు. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును ఆయన పరామర్శిస్తారు. మరోవైపు ఈ దాడి ఘటనపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News December 12, 2025
కడపలో హత్య.. వివాహేతర సంబంధమే కారణమా.?

కడపలోని రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు. స్వరాజ్ నగర్ వద్ద వల్లెపు వెంకటయ్య (27)ని సిమెంట్ రాయితో కొట్టి కిరాతకంగా చంపారు. విషయం తెలుసుకున్న రిమ్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ <<18541025>>హత్యకు వివాహేతర సంబంధమే<<>> కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
News December 12, 2025
BREAKING: కడపలో దారుణ హత్య.!

కడప జిల్లాలో శుక్రవారం ఉదయాన్నే ఓ హత్య జరిగింది. ఈ ఘటన కడపలోని స్వరాజ్ నగర్ వద్ద జరిగింది. వల్లెపు వెంకటయ్య (27)ని సిమెంట్ రాయితో కొట్టి కిరాతకంగా చంపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News December 12, 2025
కడపలో కలకలం రేపుతున్న మేయర్ ఫ్లెక్సీ.!

మేయర్‌గా ఎన్నికైన మరుసటిరోజు పాకా సురేశ్‌కు షాక్ తగిలింది. ఇంటి పన్ను చెల్లించలేదంటూ కోటిరెడ్డి సర్కిల్లోని స్టేట్ గెస్ట్‌హౌస్ వద్ద భారీ కటౌట్ వెలిసింది. YCP రంగుతో ఏర్పడిన కటౌట్‌ను కొద్దిసేపటికి నగరపాలక అధికారులు తొలగించారు. ఈ ఫ్లెక్సీలో ఎవర్రా నన్ను ఆపేది.. ఇదేమి కర్మ మన కడపకు నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అంటూ ఫ్లెక్సీలో ప్రింట్ చేయించారు. ఈ ఫ్లెక్సీ ఎవరు పెట్టారన్నదానిపై చర్చ జరుగుతోంది.


