News March 30, 2024
నేడు కడప జిల్లాకు చంద్రబాబు.. స్వల్ప మార్పులు

కడప జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా వెలువడిన షెడ్యూల్ ప్రకారం మైదుకూరు, ప్రొద్దుటూరులో పర్యటించాల్సి ఉండగా మైదుకూరు కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని కేవలం ప్రొద్దుటూరులో పర్యటించేలా షెడ్యూల్ ఖరారు అయినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఉదయం వింజమూరు నుంచి హెలికాప్టర్ ద్వారా ప్రొద్దుటూరు చేరుకొని రోడ్‌షో ద్వారా శివాలయం సర్కిల్లో బహిరంగ సభ నిర్వహిస్తారు.
Similar News
News March 17, 2026
కడప: నేటి ఇంటర్ పరీక్షలకు 12,781 మంది విద్యార్థులు హాజరు.!

కడప జిల్లాలో మంగళవారం 60 సెంటర్లలో ఇంటర్ ఫస్టియర్ ఫిజిక్స్ పేపర్-1 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఎస్పీ ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు. నేటి పరీక్షలకు 13,156 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 12,781 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షలు రాశారు. 375 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు.
News March 17, 2026
ఎంపీ అవినాష్ వ్యాఖ్యలపై భూపేశ్ రెడ్డి కౌంటర్

వివేక్ కుమార్తె సునీతను అడ్డం పెట్టుకొని టీడీపీ లబ్ధి పొందాలని చూస్తుందని ఎంపీ అవినాశ్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారని మీ మాయ మాటలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. 11 సీట్లు వచ్చినా బుద్ధి మారలేదని, దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. వివేకాను హత్య చేసింది ఎవరో ప్రజలందరికీ తెలుసని అన్నారు.
News March 17, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,600
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,352
* వెండి 10 గ్రాముల ధర రూ.2,610.


