News October 29, 2024
నేడు కడప జిల్లాకు YS జగన్.. షెడ్యూల్ ఇదే.!

YS జగన్మోహన్ రెడ్డి నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా 10:45 ప్రాంతంలో ఇడుపులపాయకు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో పులివెందుల చేరుకుని ఆయన నివాసంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. జగన్ పర్యటన నేపథ్యంలో భద్రతను కట్టిదిట్టం చేశారు. మూడు రోజులపాటు జగన్ జిల్లాల పర్యటిస్తారని పార్టీ నాయకులు తెలిపారు.
Similar News
News December 7, 2025
కడప మేయర్ ఎన్నికకు ఆహ్వానం.!

కడప మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతి కార్పొరేటర్ ఈనెల 11 జరిగే ప్రత్యేక సమావేశానికి రావాలంటూ జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ లేఖలు పంపించారు. కడప నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో ఉదయం 11 గంటలకు నూతన మేయర్‌ను కార్పొరేటర్లు ఎన్నుకోనున్నారు.
News December 7, 2025
పులివెందులలో YS జార్జిరెడ్డికి విజయమ్మ నివాళి.!

మాజీ ముఖ్యమంత్రి YSR సోదరుడు వైయస్ జార్జిరెడ్డి వర్ధంతి ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ సమాధుల తోటలో వైయస్ జార్జిరెడ్డి సమాధితోపాటు రాజారెడ్డి, వివేకానందరెడ్డి సమాధుల వద్ద పూలమాలలు పెట్టి వైఎస్ విజయమ్మ, జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ నివాళులర్పించారు. అనంతరం పులివెందులలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.