News January 24, 2025
నేడు కడప జిల్లా ఎస్పీ బాధ్యతలు స్వీకరణ

కడప జిల్లా నూతన ఎస్పీగా ఈజీ అశోక్ కుమార్ శుక్రవారం బాధ్యతలను స్వీకరిస్తున్నట్టు పోలీస్ కార్యాలయ అధికారులు తెలిపారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు ఎస్పీలను నియమించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కడప ఎస్పీగా అశోక్ కుమార్‌ను నియమించారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు కడప ఎస్పీగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు.
Similar News
News February 14, 2025
పులివెందుల : శ్రీ వెంకటరమణుడికి స్నపన తిరుమంజన సేవ

శ్రీ వెంకటరమణుడి బ్రహ్మోత్సవాలలో భాగంగా పులివెందుల పట్టణంలోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటరమణస్వామి ఆలయంలో గురువారం సాయంత్రం స్వామివారికి స్నపన తిరు మంజనసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్వామివారికి చక్రస్నానం చేయించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు, అర్చకులు పాల్గొన్నారు.
News February 14, 2025
విద్యార్థులు సమాజంలో ఆదర్శంగా నిలవాలి: కడప ఎస్పీ

విద్యార్థులు ఉత్తమ చదువులతో అత్యున్నత స్థానాలకు చేరుకొని సమాజంలో ఆదర్శంగా నిలవాలని కడప ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతలకు గురువారం ప్రశంసా పత్రాలు అందజేశారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని అత్యున్నత స్థానాలకు చేరుకోవాలని, సమాజంలో నలుగురికి ఆదర్శంగా నిలిచి మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.
News February 13, 2025
సిద్దవటం: హత్యాయత్నం కేసులో ఇద్దరికి 5 ఏళ్ల జైలు శిక్ష

సిద్దవటం పీఎస్ పరిధిలో 2015 సం.లో జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరు ముద్దాయిలకు 5 సం.ల జైలు శిక్ష, అలాగే ఒక్కొక్కరికి రూ. 1,000 జరిమానా విధిస్తూ గురువారం బద్వేల్ అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జీ పద్మ శ్రీ కోర్టులో తీర్పు ఇచ్చారు. సాక్ష్యాధారాలతో నేర నిరూపణ చేసి, శిక్ష పడేలా కృషి చేసిన కె.రవిచంద్ర APP బద్వేల్, పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.