News January 24, 2025
నేడు కరీంనగర్కు రానున్న కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్

కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ KNR లో పర్యటించనున్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్ తో కలిసి మల్టీపర్పస్ స్కూల్లో చేపట్టిన పార్కు పనులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ తో పాటు అనుబంధ పనులు, హౌసింగ్ బోర్డ్ కాలనీ 24/7 తాగునీటి సరఫరా, కుమ్మర్ వాడి హై స్కూల్ లో డిజిటల్ క్లాస్ రూమ్ ను ప్రారంభిస్తారు. బహిరంగ సభలో పాల్గొంటారు. డంపింగ్ యార్డ్ని సందర్శిస్తారు.
Similar News
News December 16, 2025
కరీంనగర్: ఎన్నికల బందోబస్తుకు 877 మంది పోలీసు సిబ్బంది

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల బందోబస్తు కోసం దాదాపు 877 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. ఇందులో ఆరుగురు ఏసీపీలు, 20 ఇన్స్పెక్టర్లు, 39 ఎస్సైలు, 40 ఏఎస్సైలు/హెడ్ కానిస్టేబుల్స్, 460 కానిస్టేబుళ్లు, 35 స్పెషల్ యాక్షన్ టీమ్ పోలీసులు, 178 హోంగార్డులు, 100 మంది బెటాలియన్ స్పెషల్ పోలీసులు, అదనంగా ఎన్సీసీ సభ్యులు కూడా ఉన్నారని పేర్కొన్నారు.
News December 16, 2025
విజయోత్సవ ర్యాలీలపై నిషేధం: సీపీ గౌస్ ఆలం

సర్పంచ్ ఎన్నికల ఫలితాల అనంతరం అదే రోజు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధం అని సీపీ గౌస్ ఆలం స్పష్టం చేశారు. రేపు జరగనున్న మూడో దశ సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలీసు అధికారులకు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ర్యాలీలు తీసిన సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు షేర్ చేసినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 16, 2025
సర్పంచ్ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు: సీపీ గౌస్ ఆలం

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో రేపు జరగనున్న మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజురాబాద్, వి.సైదాపూర్ 5 మండలాల పరిధిలో గ్రామ పంచాయతీలు 111 కాగా పోలింగ్ కేంద్రాల 1034 ఉన్నాయన్నారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల వరకు ప్రచారం, పార్టీ చిహ్నాలు, పూర్తిగా నిషేధం అన్నారు.


