News February 24, 2025
నేడు కరీంనగర్కు సీఎం

ఉమ్మడి KNR, MDK, NZB, ADB పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్కు రానున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి నిజామాబాద్, మంచిర్యాలలో ప్రచారం ముగించుకుని సాయంత్రం 4 గంటల వరకు కరీంనగర్ చేరుకుంటారు. SRR కళాశాల మైదానంలో జరిగే పట్టభద్రుల సమావేశానికి హాజరవుతారు.
Similar News
News December 4, 2025
SGB బొనాంజా.. గ్రాముకు రూ.9,859 లాభం

సావరిన్ గోల్డ్ బాండ్స్(SGB) మదుపర్లకు భారీ లాభాలను అందిస్తున్నాయి. 2017 డిసెంబర్ 4న విడుదల చేసిన సిరీస్-X బాండ్లకు అప్పట్లో గ్రాము ₹2,961గా RBI నిర్ణయించింది. తాజాగా ఆ బాండ్లు మెచ్యూరిటీకి వచ్చాయి. ప్రస్తుతం వాటి ధరను ₹12,820గా RBI నిర్ణయించింది. అంటే ఒక్కో గ్రాముపై ₹9,859 లాభం(333%) వచ్చింది. దీనికి ఏటా చెల్లించే 2.5% వడ్డీ అదనం. ఇటీవల సిరీస్-VI బాండ్లకు ₹9,121 లాభం వచ్చిన విషయం తెలిసిందే.
News December 4, 2025
నెల్లూరు: వీఆర్సీ అండర్ బ్రిడ్జ్ వద్ద రాకపోకలు బంద్

వీఆర్సీ అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలబడడంతో ఆ ప్రాంతంలో అధికారులు రాకపోకలను నిషేధించారు. ఇటీవల ఈ అండర్ బ్రిడ్జి రిపేర్లు చేసిన విషయం తెలిసిందే. సుమారు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ నీళ్లు నిలబడడంతో రాకపోకలు సాగించలేని పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో వాహనాలను అనుమతించడం లేదు. దీనివల్ల ప్రజలు కిలోమీటర్ తిరిగి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది.
News December 4, 2025
ఈఎస్ఐ గేటు వద్ద మృతదేహంతో ఆందోళన

ఈఎస్ఐ గేటు వద్ద కూర్మన్నపాలేనికి చెందిన మహిళ మృతి చెందడంతో బంధువులు, కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. ఈఎస్ఐ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే పార్వతి చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. గైనిక్ ప్రాబ్లం కావడంతో పార్వతి ఆసుపత్రిలో జాయిన్ కాగా పరిస్థితి విషమించటంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. దీంతో బంధువులు మృతదేహాన్ని గేటు వద్దకు తెచ్చి ఆందోళన చేపట్టారు


