News February 24, 2025

నేడు కరీంనగర్‌కు సీఎం

image

ఉమ్మడి KNR, MDK, NZB, ADB పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్‌కు రానున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి నిజామాబాద్, మంచిర్యాలలో ప్రచారం ముగించుకుని సాయంత్రం 4 గంటల వరకు కరీంనగర్‌ చేరుకుంటారు. SRR కళాశాల మైదానంలో జరిగే పట్టభద్రుల సమావేశానికి హాజరవుతారు.

Similar News

News December 15, 2025

మెదక్: 12 చోట్ల ఉప సర్పంచ్ ఎన్నికలు

image

మెదక్ జిల్లాలో నిన్న జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఉపసర్పంచ్ ఎన్నిక జరగనిచోట ఈరోజు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 142 పంచాయతీలలో ఎన్నికలు జరగ్గా 12 చోట్ల ఉపసర్పంచ్ ఎన్నికలు కొన్ని అనివార్య కారణాలవల్ల జరగలేదని డీపీఓ యాదయ్య తెలిపారు. ఈరోజు వార్డు సభ్యులకు నోటీసు జారీ చేసి ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నట్లు చెప్పారు.

News December 15, 2025

ఒక్క ఓటుతో సర్పంచ్ పీఠం

image

TG: హోరాహోరీగా సాగుతున్న పంచాయతీ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు ఒక్క ఓటుతో గెలిచారు. కరీంనగర్ జిల్లాలోనే ఐదుగురు ఇలా సర్పంచ్ పీఠం ఎక్కారు. కొత్తపల్లిలో శోభారాణి, పెద్దూరుపల్లిలో రామడుగు హరీశ్, మహాత్మనగర్‌లో పొన్నాల సంపత్, ముంజంపల్లిలో నందగిరి కనక లక్ష్మి, అంబల్ పూర్‌లో వెంకటేశ్ ఓటు తేడాతో విజయం సాధించారు. వరంగల్(D) ఆశాలపల్లి కొంగర మల్లమ్మ, నల్గొండ(D) ధన్‌సింగ్ తండాలో ధనావత్ కూడా ఇలా గెలిచారు.

News December 15, 2025

కర్నూలు రేంజ్‌లో 15 మంది ఎస్‌ఐల బదిలీ

image

కర్నూలు రేంజ్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 15 మంది ఎస్‌ఐలకు పరిపాలనా కారణాల దృష్ట్యా బదిలీలు చేపట్టినట్లు డీఐజీ డా.కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు సిఫారసుల మేరకు ఈ బదిలీలు అమలులోకి వచ్చాయి. బదిలీ అయిన ఎస్‌ఐలను వెంటనే రిలీవ్ చేసి, కొత్త విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని కర్నూలు, నంద్యాల ఎస్పీలకు డీఐజీ ఆదేశించారు.