News February 24, 2025
నేడు కరీంనగర్‌కు సీఎం

ఉమ్మడి KNR, MDK, NZB, ADB పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్‌కు రానున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి నిజామాబాద్, మంచిర్యాలలో ప్రచారం ముగించుకుని సాయంత్రం 4 గంటల వరకు కరీంనగర్ చేరుకుంటారు. SRR కళాశాల మైదానంలో జరిగే పట్టభద్రుల సమావేశానికి హాజరవుతారు.
Similar News
News March 25, 2025
ఏప్రిల్‌లో ‘మన ఇంటికి మన మిత్ర’

AP: వాట్సాప్ గవర్నెన్స్‌పై అవగాహన కల్పించడానికి APRలో ‘ప్రతి ఇంటికి మనమిత్ర’ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి స్మార్ట్‌ఫోన్లలో 9552300009 నంబర్‌ను సేవ్ చేసి సేవల గురించి వివరిస్తారని IT&RTG శాఖ కార్యదర్శి భాస్కర్ వెల్లడించారు. ప్రస్తుతం 210 సేవలు అందుతున్నాయని చెప్పారు. అన్ని రకాల ధ్రువపత్రాలను వాట్సాప్‌లోనే అందిస్తామని తెలిపారు.
News March 25, 2025
ఒక్క రోజులో.. 3,03,100 ఫాలోవర్స్!

మొన్నటి వరకూ ముంబై బౌలర్ విఘ్నేశ్ పుతుర్ గురించి చాలా మందికి తెలియదు. కానీ, ఒక్క మ్యాచుతో ఆయన ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఆయనకు రెండు రోజుల క్రితం 24.9వేల మంది ఫాలోవర్లుంటే, నేడు వారి సంఖ్య 3,28,000కి చేరింది. ఆటో డ్రైవర్ కొడుకు గ్రౌండ్‌లో ఆటగాళ్లను షేక్ చేశారని కొనియాడుతున్నారు. జట్టులో ఉన్న సచిన్ కుమారుడు అర్జున్ విఘ్నేశ్‌ను చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారు.
News March 25, 2025
గ్రామ పంచాయతీలు లేని జిల్లాగా మన మేడ్చల్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇక గ్రామాలు లేని జిల్లాగా మారనుంది. గతంలో 4 కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలు, 61 గ్రామ పంచాయతీలు ఉండేవి. అవన్నీ గ్రామాలు మేడ్చల్ నియోజకవర్గంలోనే అన్ని గ్రామాలు ఉండేవి. కొన్ని నెలల క్రితం 28 గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన గ్రామాలతో 3 కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడంతో గ్రామాలు లేకుండా పోయాయి. మున్సిపాలిటీల సంఖ్య 12కు చేరింది.