News April 3, 2025
నేడు కర్నూలుకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు కర్నూలుకు రానున్నారు. ఉ.9.30 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.30 గంటలకు కర్నూలుకు చేరుకుంటారు. అనంతరం నగర శివారులోని జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో వైసీపీ నేత కోట్ల హర్షవర్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొంటారు. వధూవరులను ఆశీర్వదించిన తర్వాత జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. మ.12.50 గంటలకు తాడేపల్లికి తిరుగుపయనం అవుతారు.
Similar News
News November 17, 2025
మీ తీరు కోర్టు ధిక్కారమే.. TG స్పీకర్పై SC ఆగ్రహం

TG: MLAల కేసులో స్పీకర్ తీరుపై SC ఆగ్రహించింది. ‘వారిపై నిర్ణయం తీసుకుంటారా? ధిక్కారం ఎదుర్కొంటారా? మీరే తేల్చుకోండి’ అని CJI గవాయ్ స్పష్టంచేశారు. నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో స్పీకరే నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. ఆయన తీరు కోర్టు ధిక్కారమేనన్నారు. ఆ MLAలపై వారంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. గడువులోగా విచారణ పూర్తిచేస్తామని స్పీకర్ తరఫున రోహత్గీ, సింఘ్వీ తెలిపారు.
News November 17, 2025
ఒక్క రన్ కూడా ఇవ్వకుండా 5 వికెట్లు తీశాడు!

రంజీ ట్రోఫీలో భాగంగా హరియాణాతో జరుగుతున్న మ్యాచులో సర్వీసెస్ బౌలర్ అమిత్ శుక్లా 8 వికెట్లతో రాణించారు. ఒక్క రన్ కూడా ఇవ్వకుండా తొలి 5 వికెట్లను పడగొట్టిన శుక్లా, మొత్తంగా 20 ఓవర్లలో 27 పరుగులిచ్చి 8 వికెట్లు తీశారు. అతడి దెబ్బకు హరియాణా జట్టు తొలి ఇన్నింగ్స్లో 111 రన్స్కే ఆలౌటైంది. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇప్పటివరకు 7 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 32 వికెట్లు పడగొట్టారు.
News November 17, 2025
తుని మున్సిపల్ ఛైర్పర్సన్ ఫోన్ హ్యాక్

తుని మున్సిపల్ ఛైర్పర్సన్ నార్ల భువన సుందరి ఫోన్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ఆమె మొబైల్ ఫోన్లోని కాంటాక్ట్స్కి సందేశాలు పంపిస్తూ డబ్బులు పంపించాలని కోరుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై భువన సుందరి స్పందిస్తూ.. తమ పేరుతో వచ్చే ఎలాంటి సందేశాలకు స్పందించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డబ్బులు పంపించి ఎవరూ మోసపోవద్దన్నారు.


