News April 3, 2025
నేడు కర్నూలుకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు కర్నూలుకు రానున్నారు. ఉ.9.30 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.30 గంటలకు కర్నూలుకు చేరుకుంటారు. అనంతరం నగర శివారులోని జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో వైసీపీ నేత కోట్ల హర్షవర్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొంటారు. వధూవరులను ఆశీర్వదించిన తర్వాత జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. మ.12.50 గంటలకు తాడేపల్లికి తిరుగుపయనం అవుతారు.
Similar News
News October 6, 2025
మట్టి మిద్దె కూలి ఐదేళ్ల బాలిక మృతి

మంత్రాలయం మండలం మాధవరంలో విషాదం చోటు చేసుకుంది. పాత మట్టి మిద్దె ఇల్లు అకస్మాత్తుగా కూలిపోవడంతో ఐదేళ్ల బాలిక లలిత సోమవారం మృతిచెందింది. ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యుల్లో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు మట్టి గడ్డలను తొలగించి వారిని రక్షించారు. బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.
News October 6, 2025
కర్నూలు టీచర్లకు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు

విద్యారంగంలో విశిష్ట సేవలందించిన కర్నూలు బి.క్యాంప్ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు వైవీ రామకృష్ణ, ఎన్.విజయశేఖర్‌కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డులు ప్రదానం చేశారు. ప్రపంచ అధ్యాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం కర్నూలు సెంట్రల్ లైబ్రరీ సమావేశ మందిరంలో NHR SJC India–Global, UCP & LRF సంయుక్త ఆధ్వర్యంలో లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డులు అందజేశారు.
News October 5, 2025
సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్‌పై పోటీలు: డీఈవో

ఈనెల 7న జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ అంశంపై వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ శనివారం తెలిపారు. విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ పోటీలు మంచి వేదికగా నిలుస్తాయని అన్నారు. వివరాలకు కర్నూల్–II సర్కిల్ (9000724191)తో సమన్వయం చేసుకోవాలని సూచించారు.