News April 10, 2025
నేడు కర్నూలు జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ

ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ భేటీ కానున్నట్లు ఆ పార్టీ ట్వీట్ చేసింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలలో భాగంగా.. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటుగా జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, MLCలు, MLAలు, మాజీ MPలు, మాజీ MLAలు, పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
Similar News
News December 11, 2025
కర్నూలు కలెక్టర్కు 9వ ర్యాంకు.. మంత్రి టీజీ భరత్ ర్యాంక్ ఇదే..!

కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరికి సీఎం చంద్రబాబు రాష్ట్రంలో 9వ ర్యాంక్ ఇచ్చారు. కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఆమె.. తనదైన శైలిలో పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టాక మొత్తం 1,023 ఫైల్స్ స్వీకరించారు. వాటిలో 714 ఫైల్స్ క్లియర్ చేశారు. ఫైళ్ల క్లియరెన్స్లో కర్నూలు జిల్లా మంత్రి టీజీ భరత్ 17వ స్థానంలో నిలిచారు. 548 ఫైళ్లను పరిష్కరించారు.
News December 10, 2025
100 రోజులు ప్రచారం చేయండి: కలెక్టర్

బాల్య వివాహాల రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే మన లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఏఎస్పీ హుస్సేన్ పీరాతో కలిసి బాల్య వివాహాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. బాల్యవివాహాల నిర్మూలన కోసం జిల్లా వ్యాప్తంగా 100 రోజులు నిర్విరామంగా ప్రచారాలు చేయాలని అధికారులను ఆదేశించారు.
News December 10, 2025
పీజీఆర్ఎస్ మండల కార్యాలయాల్లోనే: కలెక్టర్

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమాన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల్లోనే కొనసాగిస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, సమస్యలను లిఖితపూర్వకంగా మండల కార్యాలయంలో ఇస్తే రసీదు జారీ చేసి గడువులోగా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.


