News December 26, 2024

నేడు కర్నూలు, నంద్యాల జిల్లాలకు వర్ష సూచన

image

బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర అల్పపీడనం 24 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రభావంతో కర్నూలు, నంద్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని APSDMA సూచించింది.

Similar News

News December 12, 2025

ఆసుపత్రుల పారిశుద్ధ్యంపై కలెక్టర్ సమీక్ష

image

కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ ఏ.సిరి ప్రభుత్వ సర్వజన వైద్యశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రుల పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, శుభ్రత సేవల పర్యవేక్షణపై ఆమె ప్రత్యేక సూచనలు ఇచ్చారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పారిశుద్ధ్య ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు.

News December 12, 2025

ఆదోనిలో లారీ బోల్తా.. భయంతో డ్రైవర్ ఆత్మహత్య

image

ఆదోని మండల పరిధిలోని బైచిగేరి క్రాస్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదోని నుంచి ఎమ్మిగనూరు వైపు వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన లారీ డ్రైవర్ లక్ష్మన్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

News December 12, 2025

ఆర్యవైశ్యులు ఎప్పటికీ సీఎం చంద్రబాబుతోనే: మంత్రి టీజీ

image

సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆర్య‌వైశ్యుల‌కు స‌ముచిత గౌర‌వం క‌ల్పిస్తున్నార‌ని రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్ అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ప‌.గో జిల్లా పెనుగొండ పేరును వాస‌వీ పెనుగొండ‌గా సీఎం మార్పు చేశార‌ని, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న వైశ్యుల త‌రఫున సీఎంకు కృత‌జ్ఞత‌లు తెలుపుతున్నాన‌న్నారు. సీఎం చంద్ర‌బాబుకు ఆర్య‌వైశ్యులు ఎప్ప‌టికీ అండగా ఉంటారని మంత్రి పేర్కొన్నారు.