News September 30, 2024

నేడు కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరెట్లో ఇవాళ జరిగే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనే ప్రజలు తమ సమస్యలను రాతపూర్వకంగా సమర్పించాలని సూచించారు.

Similar News

News October 12, 2024

కొత్తగూడెం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

పండుగ వేళ కొత్తగూడెం జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలిలా.. కరకగూడెం మండలం మద్దెలగూడెం వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులలో ఒకరిని రేగళ్లకు చెందిన డోలు భద్రుగా గుర్తించారు. మరొకరిది చత్తీస్ గఢ్‌గా తెలుస్తోంది. పోలీసులు ఘటన జరిగిన తీరును ఆరా తీస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

News October 12, 2024

కొత్తగూడెం: హీటర్ పెడుతుండగా కరెంట్ షాక్‌తో మహిళ మృతి

image

హీటర్ పెడుతుండగా కరెంట్ షాక్‌తో మహిళ మృతిచెందిన ఘటన కొత్తగూడెం జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. పినపాక మండలం అమరారం పంచాయతీలోని జిన్నలగూడెంలో బొజ్జ రజిత (26) నీళ్లు వేడి చేయడానికి హీటర్ పెడుతున్న క్రమంలో కరెంట్ షాక్ తగిలింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలున్నారు. ఈ.బయ్యారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 12, 2024

తొలి పామాయిల్ మొక్కను ఎన్టీఆర్ నాటారు: తుమ్మల

image

అశ్వారావుపేటలో శనివారం జరిగిన పామాయిల్ రైతుల అవగాహన సదస్సులో మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. పామాయిల్ సాగుకు అశ్వారావుపేట పుట్టినిల్లు అని, ఎన్టీఆర్ చేతుల మీదుగా జిల్లాలో తొలి పామాయిల్ మొక్క నాటామని అప్పటి ఘటనను గుర్తు చేసుకున్నారు. గత ప్రభుత్వంలో తనకు వచ్చిన అవకాశంతో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టామన్నారు. తెలంగాణలో పామాయిల్ సాగుకు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు.