News November 18, 2024

నేడు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉ.9.30 గం.ల నుంచి మ.1 గం.వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

Similar News

News March 17, 2026

పాకాల: ఉదయాన్నే హైవేపై ప్రమాదం

image

పాకాల(M) నేండ్ర గుంట సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ప్రమాదం జరిగింది. కొత్తూరుకు చెందిన రామకృష్ణారెడ్డి ఆవుని తీసుకుని రోడ్డు దాటుచుండగా తిరుపతి వైపు వెళ్తున కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పాడి ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన రామకృష్ణారెడ్డిని ఆసుపత్రికి తరలించారు. పాకాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News March 16, 2026

ద్రవిడ వర్సిటీ వీసీగా చిన్న మల్లయ్య బాధ్యతలు

image

కుప్పం ద్రవిడ వర్సిటీ వీసీగా ఆచార్య చిన్న మల్లయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ ఎకనామిక్స్ విభాగంలో ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్న ఈయనను ప్రభుత్వం వీసీగా నియమించింది. ద్రవిడ వర్సిటీని విద్య పరిశోధన పరిపాలన రంగంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వీసీ తెలిపారు. వర్సిటీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

News March 16, 2026

సెలవులో చిత్తూరు కలెక్టర్

image

వ్యక్తిగత కారణాలతో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సెలవు పెట్టారు. నేటి నుంచి ఈనెల 20వ తేదీ వరకు సెలవులో వెళ్తున్నారు. తిరిగి ఆయన 21న విధులకు హాజరుకానున్నారు. అప్పటి వరకు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా వ్యవహరించనున్నారు.