News December 23, 2024
నేడు కలెక్టరేట్‌లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ
నంద్యాల పట్టణం కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ హలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే ప్రక్రియను పబ్లిక్ గ్రీవెన్స్ ద్వారా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9:15 గంటలకు అధికారులు హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News January 25, 2025
హత్యకు గురైన ఈరన్నకు వైసీపీ నేతల నివాళి
ఆలూరు మండలం అరికెర గ్రామంలో శుక్రవారం ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇవాళ కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గ్రామంలో ఈరన్న భౌతికకాయానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
News January 25, 2025
ఫీల్డ్ అసిస్టెంట్ హత్య.. కేసు నమోదు
ఆలూరు మండలం అరికెరలో ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న హత్యకు ఉద్యోగ విషయంలో నెలకొన్న వివాదాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఉద్యోగం వదిలేయాలంటూ టీడీపీ నేతలు ఒత్తిడి చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. లేకుంటే హత్య చేస్తామని బెదిరించి చివరకు అన్నంతపని చేశారని వాపోయారు. మృతుడి భార్య నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేశామని డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు.
News January 25, 2025
విషాదం.. అంత్యక్రియలకు వెళ్లి వస్తూ అనంతలోకాలకు!
కర్నూలు జిల్లా ఆదోని మండలం విరుపాపురం గ్రామ సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. స్థానికుల వివరాల మేరకు.. ఈ ఘటనలో నాగరాజు అనే వ్యక్తి మృతి చెందాడు. అతడి భర్య వాణి, మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు గూడూరు మండలం రేమట గ్రామానికి చెందిన వారు. వారి బాబాయ్ అంత్యక్రియలకు వచ్చి తిరిగి, రేమట గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని బంధువులు తెలిపారు. నాగరాజుకు ఇద్దరు సంతానం.