News February 10, 2025
నేడు కలెక్టరేట్‌లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ

నంద్యాలలోని కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ఆయా శాఖల అధికారులు హాజరు కావాలని సూచించారు. ప్రజలు కూడా సమస్యలపై అర్జీల రూపంలో ఇవ్వాలని కోరారు.
Similar News
News February 24, 2026
ఘోర ఓటమి.. టీమ్ ఇండియాలో భారీ మార్పులు?

T20WC సూపర్-8లో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర ఓటమి తర్వాత టీమ్ ఇండియాలో భారీ మార్పులు తప్పవని క్రీడావర్గాలు వెల్లడిస్తున్నాయి. వరుసగా విఫలమవుతున్న అభిషేక్ శర్మ, తిలక్‌లలో ఒకరిని తప్పించి శాంసన్‌కు అవకాశం ఇస్తారని పేర్కొంటున్నాయి. అలాగే సుందర్ స్థానంలో అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకుంటారని అంచనా వేస్తున్నాయి. బౌలింగ్ విభాగంలోనూ ఛేంజెస్ ఉండొచ్చంటున్నాయి. కాగా భారత్ ఈ నెల 26న జింబాబ్వేతో తలపడనుంది.
News February 24, 2026
మార్చి 2న HYDకు రాహుల్ గాంధీ

తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ సందడి నెలకొంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చే నెల 2న హైదరాబాద్‌కు రానున్నారు. ప్రధానంగా వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో నిర్వహించనున్న కాంగ్రెస్ శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో (DCC) రాహుల్ గాంధీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఎన్నికలు, పార్టీ బలోపేతంపై సూచించనున్నారు.
News February 24, 2026
BREAKING: ఒకేరోజు రూ.10,000 తగ్గిన ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. కేజీ సిల్వర్ రేటు ఏకంగా రూ.10,000 పడిపోవడంతో రూ.2,90,000 పలుకుతోంది. అటు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.430 పెరిగి రూ.1,61,780కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.400 ఎగసి రూ.1,48,300 పలుకుతోంది.


