News April 3, 2025

నేడు కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం

image

ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ సన్నిధిలో గురువారం కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ఆధ్వర్యంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఆలయా డిప్యూటీ కమిషన్ చక్రధరరావు తెలిపారు. మధ్యాహ్నం 3:30 నుంచి అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహిస్తారని తెలిపారు.

Similar News

News September 19, 2025

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర పతనం

image

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం పత్తి ధరలు పడిపోయాయి. పత్తి గరిష్ఠంగా క్వింటాం రూ.7,665, కనిష్ఠంగా రూ.7389 పలికింది. వేరుశనగ గరిష్ఠ ధర రూ.4,568, కనిష్ఠ ధర రూ.4,093, ఆముదం గనిష్ఠ ధర రూ.6,070 పలికినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. రైతులు మాత్రం పత్తి ధర రోజురోజుకూ పతనమవుతుందని ఆందోళన చెందుతున్నారు. గతంలో రూ.8-12 వేల వరకు పత్తిని కొనుగోలు చేసేవారని అన్నారు.

News September 19, 2025

సంగారెడ్డి: ప్రమాదాలు జరగకుండా చూడాలి: ఎస్పీ

image

నేషనల్ హైవే 161 రోడ్డుపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎస్పీ పారితోష్ పంకజ్ ఆదేశించారు. పుల్కల్ మండల పరిధిలోని నేషనల్ హైవే ప్రాంతాన్ని గురువారం పరిశీలించారు. హైవేపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనాల వేగం అదుపు చేసేందుకు ర్యాంబుల్ స్ట్రిప్స్, ఇసుక డ్రమ్ములు ఏర్పాటు చేయాలని సూచించారు.

News September 19, 2025

20న జనగామలో ఫుట్‌బాల్ క్రీడా ఎంపికలు

image

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 20న జనగామ సాంఘిక సంక్షేమ బాలుర గురుకులంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్-19 ఫుట్‌బాల్ క్రీడా ఎంపికలు జరుగుతాయి. ప్రతి కళాశాల నుంచి ఐదుగురికి మాత్రమే అవకాశం ఉంటుందని క్రీడల కన్వీనర్ అజ్మీర కిషన్ తెలిపారు.