News March 17, 2025
నేడు కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చేతన్ ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు ప్రజలు సమస్యలపై అర్జీలు తెలుపవచ్చని పేర్కొన్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
Similar News
News November 10, 2025
రోడ్డు ప్రమాదాలపై కేంద్రం, NHAIకి SC నోటీసులు

ఇటీవల TG, రాజస్థాన్లలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై సుప్రీం కోర్టు విచారించింది. NHల నిర్వహణపై నివేదిక ఇవ్వాలని కేంద్రం, NHAIని ఆదేశించింది. రోడ్లపై వాహనాల పార్కింగ్ వల్లే ఈ ప్రమాదాలని జస్టిస్ JK మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిలో ఆయా రాష్ట్రాల CSలనూ పార్టీగా చేర్చాలని పేర్కొంది. రోడ్డు ప్రమాదాల్లో TGలో 19మంది, రాజస్థాన్లో 18మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే.
News November 10, 2025
కార్పొరేషన్ల డైరెక్టర్లుగా విజయనగరం నేతలకు అవకాశం

జిల్లాకు చెందిన పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను వివిధ కార్పొరేషన్లకు రాష్ట్ర డైరెక్టర్లుగా నియమిస్తూ కూటమి ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది.
> రమణాజీ& బంగారునాయుడు-దాసరి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్(ఎస్.కోట)
> మల్లేశ్వరావు-కలింగ కోమటి(విజయనగరం)
> కాళ్ల సత్యవతి&కొండల శ్రీనివాస్-నాగవంశం(నెల్లిమర్ల)
> సుంకరి సాయి రమేశ్-కళింగ వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్ డైరెక్టర్(బొబ్బిలి)
News November 10, 2025
యాక్సిడెంట్.. ఒకరి మృతి

నరసన్నపేట మండలం కోమార్తి జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ కారు మరమ్మతులకు గురికావడంతో పెద్దపాడు నుంచి మెకానిక్ కోరాడ వెంకటేశ్ వచ్చి మరమ్మతులు చేస్తున్నాడు. ఆ సమయంలో వెనక నుంచి వస్తున్న కారు ఆగి ఉన్న కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో వెంకటేశ్ మృతిచెందగా కారులో ఉన్న సంతోశ్, సుశీల, శ్యాముల్ గాయపడ్డారు.


