News March 8, 2025
నేడు కస్తూర్బా కళాక్షేత్రంలో మహిళా దినోత్సవం: కలెక్టర్

శనివారం నెల్లూరు నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. మహిళల కోసం పలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు మహిళలను, పొదుపు సంఘాల మహిళలను సత్కరించనున్నట్లు తెలిపారు. అనంతరం పొదుపు సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు, వివిధ పథకాల కింద ఆస్తుల పంపిణీ, ప్రొసీడింగ్స్ అందజేస్తామన్నారు.
Similar News
News March 25, 2025
జాతీయ ఆహార భద్రత మిషన్ పేరు మార్చారా?

కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత మిషన్ పేరు మార్చిందా అని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు లోక్ సభలో ఆయన పలు అంశాలపై చర్చించారు. పోషకాహార లక్ష్యాల సాధనలో జాతీయ ఆహార భద్రత మిషన్ పేరు మార్పు ఎంతవరకు సహాయపడుతుందని ప్రశ్నించారు. సాంప్రదాయ రకాల పంటలు, తృణధాన్యాలు, మినుములలో విత్తన లభ్యతను పెంపొందించడంలో ఈ పథకం ఎంత వరకు సహాయ పడుతుందో తెలియజేయాలన్నారు.
News March 25, 2025
నెల్లూరు జిల్లాలో తగ్గిన ధరలు..?

నెల్లూరులో జిల్లాలో వరి కోతలు ప్రారంభం అయ్యాయి. నిరుడు పుట్టి(20 బస్తాలు) రూ.23వేల ధర పలగ్గా.. ఇప్పుడు ఆ ధర రూ.18,500కు తగ్గినట్లు రైతులు తెలిపారు. మరికొన్ని చోట్ల ఈ ధర రూ.16వేల వరకు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం రైతులకు రూ.19వేల మద్దతు ధర చెల్లిస్తుంది. ధరలు పడిపోవడంతో పెట్టుబడులు కూడా రావంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ ఊరిలో ధాన్యం ధరలు ఎలా ఉన్నాయో గ్రామం, మండలంతో కామెంట్ చేయండి.
News March 25, 2025
నెల్లూరులో జాడే లేని అనిల్ కుమార్ యాదవ్.?

నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాణి దూకుడు పెంచారు. వరుసగా కార్యకర్తలు, నేతలను కలుస్తూ వారికి అండగా ఉంటున్నారు. MLC చంద్రశేఖర్ రెడ్డి సైతం అటు శాసనమండలి, ఇటు బహిరంగంగా టీడీపీ నేతలను ఎండగడుతున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్, మేకపాటి రాజగోపాల్ రెడ్డి, విక్రమ్ రెడ్డి వంటి నేతలు మాత్రం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటంతో కార్యకర్తలు, నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.