News August 14, 2024

నేడు కాకినాడకు పవన్ కళ్యాణ్ రాక

image

కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారైంది. హెలికాప్టర్‌లో నేటి సాయంత్రం కాకినాడకు చేరుకుంటారు. JNTU గెస్ట్ హౌస్‌లో రాత్రి బస చేస్తారు. గురువారం ఉదయం పోలీసు పరేడ్ మైదానంలో జాతీయ జెండా ఎగరవేస్తారు. తర్వాత చేబ్రోలులోని తన నివాసానికి చేరుకుంటారు. రేపు రాత్రికి గవర్నర్ నిర్వహించే ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండటంతో ఆయన విజయవాడకు వెళ్తారా? పిఠాపురంలోనే ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.

Similar News

News September 19, 2024

చిరుతను పట్టుకునేందుకు 100 ట్రాప్ కెమెరాలు: భరణి

image

చిరుత పులిని పట్టుకునేందుకు 100 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని తూ.గో. జిల్లా అటవీ శాఖ అధికారి భరణి గురువారం తెలిపారు. గత రాత్రి శ్రీరాంపురం, పాలమూరు ప్రాంతాల్లో చిరుత సంచరించినట్లు వచ్చిన సమాచారం అవాస్తవమన్నారు. నిపుణుల బృందం పాదముద్రలు పరిశీలించగా అవి అడవి పిల్లి పాద ముద్రలుగా నిర్ధారణ జరిగిందన్నారు. ట్రాప్ కెమెరాలో అడవి పిల్లిని గుర్తించడం జరిగిందని తెలిపారు. అసత్య ప్రచారాలు నమ్మొద్దన్నారు.

News September 19, 2024

తూ.గో: 24లోపు స్కాలర్షిప్ పరీక్ష కోసం దరఖాస్తులు

image

తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈనెల 24వ తేదీలోపు నేషనల్ మెయిన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు తెలిపారు. ఈ మేరకు ఆయన రాజమహేంద్రవరంలో గురువారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. https://www.bse.ap.gov.in ఆసక్తి గల విద్యార్థులందరూ ఈ వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News September 19, 2024

తూ.గో: కూటమి 100 రోజుల పాలనపై మీ కామెంట్?

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో 19 అసెంబ్లీ సీట్లను క్లీన్ స్వీప్ చేసి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రేపటితో 100 రోజుల పాలన పూర్తి చేసుకోనుంది. జిల్లాలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని ఈనెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. పింఛన్ పెంపు, అన్నక్యాంటీన్లు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని YCP విమర్శిస్తోంది. మీ ఎమ్మెల్యే పనితీరుపై కామెంట్ చేయండి.