News August 13, 2024

నేడు కాకినాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన

image

కాకినాడలో మంగళవారం (నేడు) రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించనున్నట్లు కాకినాడ కలెక్టరేట్ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఉదయం 10 గంటల నుంచి ఆయన జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ఈ సమావేశానికి అధికారులంతా తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.

Similar News

News September 10, 2024

కాకినాడ: ఈ మండలాల్లో రేపు స్కూళ్లకు సెలవు

image

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కాకినాడ జిల్లాలోని పలు పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించినట్లు విద్యాశాఖ అధికారి రమేష్ తెలిపారు. కలెక్టర్ షాన్ మోహన్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని గొల్లప్రోలు, యు.కొత్తపల్లి, పిఠాపురం, కిర్లంపూడి మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని అన్ని పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు గమనించాలన్నారు.

News September 10, 2024

ఉమ్మడి తూ.గో.లో విజృంభిస్తున్న విష జ్వరాలు

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 162 PHCలు, 12 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏడు ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో నిత్యం సగటున 2వేల వరకు సీజనల్ జ్వరాల కేసులు నమోదు కావడం కలవర పెడుతోంది. వీటికి తోడు ప్రైవేటు ఆసుపత్రుల్లో వేలాది మంది చికిత్స పొందుతున్నారు. గత నెలలో 50 వేల కేసులు, ఈ నెలలో ఇప్పటివరకు 13వేల కేసులు నమోదయ్యాయి.

News September 10, 2024

తూ.గో., కోనసీమ కలెక్టర్లతో మాట్లాడిన సీఎం

image

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై తూ.గో., కోనసీమ కలెక్టర్లతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. భారీ వర్షాలు, వరద పరిస్థితుల దృష్ట్యా ముంపు సమస్యపై నష్టతీవ్రతపై అంచనాను బుధవారం సాయంత్రానికి పూర్తి చేయాలన్నారు. వీధుల్లో పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగాలని, ఇవాళ సాయంత్రానికి సరకుల పంపిణీని కూడా పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు.