News November 5, 2024
నేడు కాచిగూడలో రాష్ట్ర స్థాయి బీసీ విద్యార్థి సదస్సుకు

కాచిగూడలోని అభినందన్ గ్రాండ్లో నేడు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి బీసీ విద్యార్థుల సదస్సుకు భారీ ఏర్పాట్లు చేశారు. కాచిగూడ పరిసర ప్రాంతాలను రాత్రింబవళ్లు విద్యార్థులు కష్టపడి బీసీ జెండాలతో అలంకరించారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ అధ్యక్షతన ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.
Similar News
News December 23, 2025
3నెలల్లో భాగ్యలతలో FOB: మంత్రి కోమటిరెడ్డి

NH65పై మృత్యుఘోషకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం డెడ్లైన్ విధించింది. భాగ్యలత వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి (FOB)ని 3నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. హయత్నగర్ వద్ద యజమానుల మొండితనం, కోర్టు స్టేతో రోడ్డు విస్తరణకు లేట్ అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ప్రజల ప్రాణాలు పోతుంటే ఊరుకోం.. బందోబస్తు మధ్య పనులు పూర్తి చేయండి’ అని అధికారులకు వార్నింగ్ ఇచ్చినట్లు Way2Newsతో తెలిపారు.
News December 23, 2025
మూడు కార్పొరేషన్లుగా మహానగరం..!

GHMCలో మున్సిపాలిటీల విలీనం అనంతరం మహానగరం 300 డివిజన్లకు పెరిగింది. అయితే ఇంత పెద్ద నగరానికి ఒకే కార్పొరేషన్ ఉండాలా లేక విభజించాలా అనే విషయాన్ని సర్కారు ఆలోచిస్తోంది. మంత్రులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై తీవ్రంగా చర్చించినట్లు సమాచారం. గ్రేటర్ను 3 కార్పొరేషన్లుగా విభజించాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.
News December 23, 2025
ఢిల్లీకి చేరువలో HYD పొల్యూషన్

HYDలో ఎయిర్ క్వాలిటీ ఢిల్లో పరిస్థితి దగ్గరలో ఉంది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో 300 ఉండగా.. నగరంలో డబుల్ డిజిట్లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ 270కి చేరింది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు తప్పనిసరిగా మాస్కులు ధరించడం మేలని, చిన్న పిల్లలను దీని నుంచి కాపాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు.


