News November 5, 2024

నేడు కాచిగూడలో రాష్ట్ర స్థాయి బీసీ విద్యార్థి సదస్సుకు

image

కాచిగూడలోని అభినందన్ గ్రాండ్‌లో నేడు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి బీసీ విద్యార్థుల సదస్సుకు భారీ ఏర్పాట్లు చేశారు. కాచిగూడ పరిసర ప్రాంతాలను రాత్రింబవళ్లు విద్యార్థులు కష్టపడి బీసీ జెండాలతో అలంకరించారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ అధ్యక్షతన ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.

Similar News

News December 13, 2024

HYD: సరస్వతీ నది పుష్కరాలపై మంత్రి సమీక్ష

image

సచివాలయంలో సరస్వతీ నది పుష్కరాల నిర్వహణకు సంబంధించి సమీక్షా సమావేశం దేవాలయ శాఖ మంత్రి కొండా సురేఖ నిర్వహించారు.  ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఎండీ ప్రకాష్ రెడ్డి, దేవాదాయ శాఖ ఆర్‌జేసీ రామకృష్ణా రావు, అధికారులు పాల్గొన్నారు.

News December 13, 2024

HYD: బన్నీ ARREST… ఎప్పుడేం జరిగిందంటే..?

image

>ఉ.11.45కు – జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన పోలీసులు >మ.12.00- సంధ్య థియేటర్ ఘటన కేసులో అరెస్టు చేస్తున్నామని చెప్పిన పోలీసులు > మ.12.15- నివాసం నుంచి చిక్కడపల్లి PSకు తరలింపు >మ.1- బన్నీతో PSకు చేరుకున్న పోలీసులు > మ.2.10 – వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలింపు >మ.2.50 – గాంధీలో ముగిసిన వైద్య పరీక్షలు.. నాంపల్లి కోర్టుకు తరలింపు >3.20కు కోర్టుకు రాక >సా.4 గంటలకు విచారణ  

News December 13, 2024

రచయిత కంచ ఐలయ్యకు హైకోర్టులో ఊరట

image

రచయిత కంచ ఐలయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. కోరుట్ల, కరీంనగర్, మల్కాజిగిరి PSలో కేసుతో పాటు పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులను హైకోర్టు కొట్టేసింది. ఆయన ఓ పుస్తకం రాయడంతో నమోదైన కేసులన్నీ రాజ్యాంగపరిధిలోని భావ వ్యక్తీకరణకిందికే వస్తాయని హైకోర్టు పేర్కొంది. పుస్తకాన్ని బ్యాన్ చేయాలనే కేసును సుప్రీంకోర్టు 2017లో తిరస్కరించినా, రచయితకు శిక్ష పడాలని పలువురు హైకోర్టును ఆశ్రయించారు.