News October 16, 2024

నేడు కాళేశ్వరంలో కోజా గిరి పౌర్ణమి వేడుకలు

image

కాళేశ్వరంలోని కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం కోజా గిరి పౌర్ణమి సందర్భంగా ఆలయంలో రాత్రి 9 గం.ల నుంచి 11 గం.ల వరకు భజన ఉంటుందని ఈవో తెలిపారు. 11.30 గంటలకు కౌముది పూజ (పాలలో చంద్రుని) దర్శన కార్యక్రమం, అనంతరం తీర్థప్రసాద వితరణ నిర్వహించనునట్లు చెప్పారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

Similar News

News December 15, 2025

KNR: పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం పోలింగ్ స్టేషన్ల వారీగా సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి పూర్తి చేశారు. డీపీఓ జగదీశ్వర్‌తో సమీక్ష జరిపి, ఎన్నికలు జరిగే మండలాల్లో బ్యాలెట్ బాక్సులు, పోస్టల్ బ్యాలెట్ల తరలింపు సహా అన్ని ఏర్పాట్లపై చర్చించారు.

News December 15, 2025

హుజూరాబాద్: 5 మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు: CP

image

​KNR పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 17న మూడో దశ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు CP గౌష్ ఆలం తెలిపారు. 144 సెక్షన్ 48 గంటల పాటు వీణవంక , ఇల్లందకుంట, జమ్మికుంట, హుజూరాబాద్, వి.సైదాపూర్ మండలాల పరిధిలో అమలులో ఉంటాయన్నారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం లేదా సమావేశం కావడాన్ని పూర్తిగా నిషేధించినట్లు చెప్పారు.

News December 15, 2025

రామడుగు హరీష్‌కు ‘ఒక్క’ ఓటు అదృష్టం!

image

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దూరుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రామడుగు హరీష్‌ సంచలన విజయం సాధించారు. ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన హరీష్‌పై అందరి దృష్టి పడింది. ఆయన తన సమీప ప్రత్యర్థిపై కేవలం ఒక్కే ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందడం విశేషం. ఒక ఓటుతో గెలుపొందడం తన అదృష్టంగా భావిస్తున్నానని హరీష్ తెలిపారు.