News February 8, 2025

నేడు కావలిలో జిల్లా కలెక్టర్ ఆనంద్ పర్యటన

image

నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ శనివారం కావలి పట్టణంలో పర్యటించనున్నారు. కలెక్టర్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నం 2:30 గంటలకు నెల్లూరు జిల్లా కలెక్టర్ కావలి సెల్ఫీ పాయింట్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 3.00 గంటలకు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వెంగళరావునగర్‌లో ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు ఇందిరమ్మ కాలనీలో సిసి రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు. 

Similar News

News March 28, 2025

హీరోను అంటూ నమ్మించి దారుణం.. కేసు నమోదు

image

సినీ హీరోను అంటూ నమ్మించి మహిళను మోసం చేసిన ఘటనలో యువకుడిపై నెల్లూరు చిన్న బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి(D) కోట మండలానికి చెందిన ఓ మహిళ భర్త నుంచి విడిపోయింది. నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తోంది. ఆమెకు ఇన్‌స్టాలో సునీల్ రెడ్డి పరిచయం అయ్యాడు. హీరోను అంటూ నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకోమని కోరగా ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలతో సునీల్ బెదిరించి దాడి చేశాడు.  

News March 28, 2025

నెల్లూరు జిల్లా ప్రజలకు గమనిక 

image

ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ నగదును లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా జమ చేస్తుందని జాయింట్ క‌లెక్ట‌ర్ కార్తీక్ తెలిపారు. దీపం 2 స్కీం కింద లబ్ధిదారులు సబ్సిడీ అమౌంట్ తమ ఖాతాలో జమ అయిందా లేదా అని https://epds2.ap.gov.in/lpgDeepam/epds పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. వినియోగదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా జాయింట్ కలెక్టర్ కార్తీక్ కోరారు.

News March 28, 2025

చాకిచర్ల సచివాలయం వ్యవహారంపై ఆరా తీసిన కలెక్టర్..

image

మండలంలోని చాకిచర్ల సచివాలయం వివాదాస్పద వ్యవహారంపై జిల్లా కలెక్టర్ నివేదిక కోరినట్లు MPDOవిజయ తెలిపారు. మంగళవారం రాత్రి ఓ ప్రైవేట్ వ్యక్తి సచివాలయం తాళం తీసి లోపలికి వెళ్ళడం.. దానిని పసిగట్టిన స్థానికులు ఆ వ్యక్తిని నిలదీసిన వైనం గురించి way2news లో ‘తాళం ఎందుకు తీశారు’.? అంటూ కథనం వచ్చిన సంగతి తెలిసిందే. సంచలనం రేపిన ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక పంపుతున్నట్లుMPDO చెప్పారు

error: Content is protected !!